నేను చూసిన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్: గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీపై సచిన్ టెండూల్కర్ ఎమన్నారంటే..?
Glenn Maxwell: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో వీరోచిత, స్ఫూర్తిదాయకమైన డబుల్ సెంచరీతో అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన గ్లెన్ మాక్స్ వెల్ పై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు.
Sachin Tendulkar on Glenn Maxwell double century: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా అఫ్గానిస్తాన్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ పై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. వరుస వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదని భావించిన తరుణంలో క్రీజులోకి వచ్చి ఒంటరి పోరాటంతో డబుల్ సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆట మధ్యలో వెన్నునొప్పి, తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడుతూనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాక్స్ వెల్ కేవలం 128 బంతుల్లోనే అజేయంగా 201 పరుగులు సాధించాడు.
వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేశాడు. చారిత్రలో నిలిచిపోయే మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ పై క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ ఇన్నింగ్స్ ను తన జీవితలో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ గా సచిన్ కొనియాడారు. తీవ్రమైన ఒత్తిడిని గరిష్టమైన పనితీరుతో ఫలితాన్ని రాబట్టిన తీరుగా అభివర్ణించారు.