కరోనా మహమ్మారి తో పోరాడుతూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న డాక్టర్లను గౌరవిస్తూ, వారి సేవలను గుర్తిస్తూ ఇంగ్లాండ్ టీం డాక్టర్ల పేరున్న జెర్సీలను ధరించారు. రైజ్ ది బ్యాట్ కాంపెయిన్ లో భాగంగా కరోనా పై పోరాడుతున్న డాక్టర్ల పేర్లను ఇంగ్లాండ్ లోని క్రికెట్ క్లబ్బులు ప్రతిపాదించాయి. 

లండన్ లో పనిచేస్తున్న మన భారతీయ డాక్టర్ వికాస్ కుమార్ పేరును కూడా ప్రతిపాదించారు. నేషనల్ హెల్త్ సర్వీస్ హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ యూనిట్ లో వైద్యుడిగా ఈయన పనిచేస్తున్నాడు. 

వికాస్ కుమార్ పేరున్న జెర్సీని ఇంగ్లాండ్ కెప్టెన్, ప్రపంచ కప్ హీరో బెన్ స్టోక్స్ ధరించాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చిన్నప్పటినుండి క్రికెట్ ఆడాలని కలలుగానే వికాస్ కుమార్ క్రికెట్ ఆటకు అత్యంత దగ్గరగా వ్యవహరించింది ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్ కు డ్యూటీ డాక్టర్ గా పనిచేసినప్పుడు. 

ఢిల్లీ యూనివర్సిటీ నుండి మెడిసిన్ పూర్తి చేసిన వికాస్ మౌలానా ఆజాద్ కాలేజ్ నుండి అనస్థీషియాలో పీజీ పూర్తి చేసాడు. 2019లో భార్య, కొడుకుతో కలిసి ఇంగ్లాండ్ కి మకాం మార్చాడు. 

ఇప్పుడు అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అనస్థీషియా డిపార్ట్మెంట్ లో ఈ కరోనా కాలంలో తన సేవలను అందిస్తున్నాడు. ఇంట్లో కూడా పూర్తిస్థాయి ఇసోలాటిన్ లోనే ఉంటున్నట్టుగా వికాస్ తెలిపాడు. 

చిన్నప్పటినుండి క్రికెట్ ఆటకు వికాస్ వీరాభిమాని, ఆయన క్రికెట్ ఆడాలని కలలుగన్నప్పటికీ... ఇంట్లో అందరు సోదరుల్లాగే డాక్టర్ అయ్యానని చెబుతున్నాడు. ఇప్పటికి ఇంగ్లాండ్ లో ఒక క్లబ్ తరుఫున వికాస్ క్రికెట్ ఆడుతుంటాడు.