మీడియా పై  ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ భార్య మండిపడ్డారు. మా భార్య, భర్తల మధ్య ఉన్న ప్రేమను మీరు గొడవ ఎలా అంటారు అని ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల ఇంగ్లండ్ లో ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బెన్ స్టోక్స్ తన భార్య క్లారే స్టోక్స్ తో కలిసి హాజరయ్యాడు.

ఈ కార్యక్రమంలో ఇద్దరూ చక్కగా మీడియా ముందు మంచిగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమం ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని... క్లారే స్టోక్స్.., బెన్ స్టోక్స్ ముఖంపై దాడి చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫోటోలో క్లారే... బెన్ స్టోక్స్ ముఖాన్ని చేతితో వత్తుతున్నట్లుగా ఉంది.

ఈ ప్రచారంపై క్లారే తాజాగా స్పందించారు. అసలు ఇలాంటి చెత్త వార్తలు ఎలా పుట్టిస్తారని ఆమె మండిపడ్డారు. అది తమ భార్య, భర్తల మధ్య ఉన్న ప్రేమ అని... దానిని మీరు గొడవ అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. బెన్, తాను ఎప్పుడూ సరదాగా అలా ఒకరి ముఖాన్ని మరోకరు పట్టుకుంటామని ఆమె చెప్పారు. అవార్డ్స్ కార్యక్రమం తర్వాత వారిద్దరూ మెక్ డోనాల్డ్స్ కి కూడా వెళ్లి సరదాగా గడిపామని ఆమె చెప్పారు. ఇలాంటి చెత్తను ప్రచారం చేయకండి అంటూ కాస్త ఘాటుగానే ఆమె ట్వీట్ చేశారు.

కాగా.. ఆమె ట్వీట్ కి బెన్ స్టోక్స్ కూడా స్పందించాడు. ఆమె ట్వీట్ ని రీట్వీట్ చేసి... ముద్దుపెడుతున్న ఎమోజీని అందులో పెట్టాడు. అంటే.... తన భార్య చెప్పింది అక్షరాలా నిజమని బెన్ కూడా చెప్పకనే చెప్పాడు.