బెన్ స్టోక్స్... టీమిండియాతో జరిగిన మొదటి వన్డేలో త్వరగా అవుటైన ఈ డేంజరస్ ప్లేయర్, రెండో వన్డేలో బీభత్సమై సృష్టించాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఆ తర్వాత 12 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 43 పరుగులు చేశాడు. అయితే 52 బంతుల్లో 99 పరుగులు చేసిన బెన్ స్టోక్స్... భువనేశ్వర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

సెంచరీ మార్కును సింగిల్ రన్‌తో మిస్ చేసుకున్న బెన్ స్టోక్స్, పెవిలియన్‌కు వెళుతూ ఆకాశాన్ని చూసి ‘సారీ...’ అంటూ చెప్పడం టీవీల్లో కనిపించింది. బెన్ స్టోక్స్ తండ్రి గెడ్ స్టోక్స్, ఐపీఎల్ ముగిసిన తర్వాత బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించారు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడం వల్లే గత సీజన్‌కి ఆలస్యంగా వచ్చాడు బెన్ స్టోక్స్...

అయితే 40 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ రనౌట్‌పై థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. బంతి వికెట్లను తాకినప్పుడు బ్యాటు లైన్ దాటకపోయినా నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్...