కరోనా కారణంగా బంతిపై ఉమ్ము పూయడంపై నిషేధం...
బెన్ స్టోక్స్ చేసిన పనికి బంతిని శానిటైజ్ చేసిన అంపైర్లు...
కరోనా కారణంగా క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బంతికి ఉమ్ము పూయడంపై నిషేధాన్ని విధించింది ఐసీసీ. అయితే టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, అనుకోకుండా బంతికి ఉమ్ము రాశాడు.
12వ ఓవర్ వేసిన తర్వాత బంతిని అందుకున్న బెన్‌స్టోక్స్, బంతికి ఉమ్ముపూయడాన్ని అంపైర్లు గుర్తించారు. వెంటనే బంతిని తీసుకున్న అంపైర్లు, దాన్ని శానిటైజర్‌తో శుభ్రం చేశారు. మారిన నియమాల ప్రకారం ఎవ్వరైనా అనుకోకుండా బంతికి ఉమ్ము పూస్తే, రెండు సార్లు అంపైర్లు వార్నింగ్ ఇస్తారు.
మూడోసారి దాన్ని రిపీట్ చేస్తే, పెనాల్టీగా బ్యాటింగ్ చేస్తున్న జట్టుకి 5 పరుగులు జత చేస్తారు. 21 ఓవర్లు ముగిసేసరికి గిల్, పూజారా వికెట్లు కోల్పోయిన టీమిండియా 57 పరుగులు చేసింది.
Last Updated Feb 24, 2021, 9:05 PM IST