Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ హరితహారం.. డాట్ బాల్స్‌కు ఎన్ని మొక్కలను నాటబోతుంది..? ఎన్ని ఎకరాల్లో తెలుసా..?

IPL Playoffs 2023: ఐపీఎల్-16 ప్లేఆఫ్స్‌లో బౌలర్లు వేసే ప్రతీ డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటుతామని  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇదివరకే ప్రకటించింది. 

BCCI To Plant 147000 Trees Across the  India For Dot Balls in IPL Playoffs MSV
Author
First Published Jun 1, 2023, 1:14 PM IST

ఐపీఎల్-16 పుణ్యమా అని  దేశవ్యాప్తంగా  బీసీసీఐ 146 ఎకరాలలో  మొక్కల పెంపకం చేపట్టనుంది.   ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ -2, ఫైనల్స్ లో  బౌలర్లు వేసే ప్రతి డాట్ బాల్‌కు   ఐదు వందల మొక్కలు నాటుతామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.  ఐపీఎల్ ప్లేఆఫ్స్   ముగిసిన నేపథ్యంలో   ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయి..?  బీసీసీఐ ఎన్ని మొక్కలు నాటనుంది..? అన్న తదితర విషయాలు ఇక్కడ  తెలుసుకుందాం. 

ప్లేఆఫ్స్ లోని నాలుగు మ్యాచ్ లలో  కలిపి  బౌలర్లు 294 డాట్ బాల్స్ వేశారు. ఒక్కో మ్యాచ్ లో చూసుకుంటే..  చెన్నై లోని చెపాక్ వేదికగా  జరిగిన చెన్నై - గుజరాత్ మ్యాచ్ లో   84 డాట్ బాల్స్ పడ్డాయి.  అంటే  క్వాలిఫయర్-1 లోనే 42 వేల మొక్కలు నాటేందుకు బీజం పడింది. 

ఇక ముంబై - లక్నోల మధ్య జరిగిన ఎలిమిటనేటర్ మ్యాచ్ లో 96 డాట్ బాల్స్ (48 వలే మొక్కలు) విసిరారు ఇరు జట్ల బౌలర్లు.  రెండో క్వాలిఫయర్ ముంబై - గుజరాత్ మ్యాచ్ లో  67 డాట్ బాల్స్ (26 వేల 500 మొక్కలు)  నమోదయ్యాయి. ఇక చెన్నై - గుజరాత్ మధ్య జరిగిన  ఫైనల్స్ లో  45 డాట్ బాల్స్ పడ్డాయి.  వీటిని మొక్కల్లోకి కన్వర్ట్ చేస్తే  22 వేల ఐదు వందలు. 

 

మొత్తంగా ప్లేఆఫ్స్ లోని నాలుగు మ్యాచ్ లలో 294 డాట్ బాల్స్‌కు  గాను  బీసీసీఐ  ఒక లక్షా 47 వేల మొక్కలు నాటేందుకు  సిద్ధమైంది.    

ఎంత భూమి కావాలి..? 

సాధారణంగా ఒక హెక్టార్‌‌ (2.47 ఎకరాలు)‌లో 2,500 మొక్కలు నాటేందుకు వీలుంటుంది.  అంటే   ఒక లక్షా 47వేల మొక్కలను నాటాలంటే  59 హెక్టార్లు అవసరం అవుతుంది. అంటే  146 ఎకరాలలో ఈ మొక్కల పెంపకాన్ని  చేపట్టేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది.  మరి  వీటిని ఎక్కడ నాటుతారు..?  ఏ మొక్కలు నాటుతారు..? అన్నదానిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios