Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020: చైన్నై సూపర్ కింగ్స్‌లో 13 మందికి కరోనా.. బీసీసీఐ అధికారిక ప్రకటన

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐ సైతం ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల  చేసింది.

bcci statement on corona testing in IPL Contingent
Author
Mumbai, First Published Aug 29, 2020, 6:02 PM IST

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐ సైతం ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల  చేసింది.

సీఎస్కే‌లోని ఇద్దరు ఆటగాళ్లు, మరో 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకిందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణతో పాటు ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది.

కాగా ఐపీఎల్ కోసం అన్ని జట్టూ యూఏఈకి చేరుకున్నాకా ఆగస్టు 20-28 తేదీల మధ్య ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, ఆయా జట్ల యాజమాన్యాలకు కలిపి 1,988 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని బీసీసీఐ వెల్లడించింది.

ఈ టెస్టుల్లో ఇద్దరు  క్రికెటర్లకు, 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకినట్లు  నిర్థారించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని పేర్కొంది. వారిని కలిసిన వారిని సైతం క్వారంటైన్‌లో ఉంచామని చెప్పింది.

ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వారికి చికిత్స అందిస్తున్నట్లే వెల్లడించింది. మరోవైపు  ఈ టోర్నీ జరిగే అన్ని రోజులూ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు ఆటగాళ్లకు రెగ్యులర్‌గా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios