Asianet News TeluguAsianet News Telugu

BCCI: 2022లో టీమిండియా బెస్ట్ పర్ఫార్మర్స్ లిస్ట్ విడుదల.. మూడు ఫార్మాట్లలో మొనగాళ్లు వీళ్లే..

BCCI: బీసీసీఐ జాబితా ప్రకారం.. టెస్టులు,  వన్దేలు, టీ20లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాటర్, బౌలర్  పేర్లను  వెల్లడించారు. మూడు ఫార్మాట్లలోని పేర్ల జాబితా ఇలా ఉంది..

BCCI releases  Best Performer Names in 2022, Here is The List
Author
First Published Jan 1, 2023, 11:20 AM IST

2022లో భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ద్వైపాక్షిక సిరీస్ లలో  దుమ్మురేపినా కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. అయితే గతేడాది  (2022) లో  టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు  చేసిన ఆటగాళ్ల  జాబితాను  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది.   ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్  టెస్టులలో అత్యుత్తమ బ్యాటర్ గా నిలవడం గమనార్హం. 

బీసీసీఐ జాబితా ప్రకారం.. టెస్టులు,  వన్దేలు, టీ20లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాటర్, బౌలర్  పేర్లను  వెల్లడించారు. జాబితా ప్రకారం టెస్టులలో  రిషభ్ పంత్  బెస్ట్ పర్ఫార్మర్ గా ఎంపికయ్యాడు. బెస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. 

టెస్టులలో.. 

గతేడాది పంత్.. ఏడు టెస్టులలో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై) , నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. బుమ్రా.. ఐదు టెస్టులలో 22 వికెట్లు పడగొట్టాడు.  ఉత్తమ ప్రదర్శన 5-24గా ఉంది.  రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

 

వన్డేలలో.. 

వన్డేలలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బెస్ట్ బ్యాటర్ గా నిలవగా  మహ్మద్ సిరాజ్ బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. 2022లో అయ్యర్.. 17 వన్డేలలో 55.69 సగటుతో 724 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.  ఇక సిరాజ్.. 15 మ్యాచ్ లలో 24 వికెట్లు తీశాడు. 

 

టీ20లలో.. 

2022లో టీ20లలో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న టీమిండియా బ్యాటర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ ముంబైకర్ నే టీ20లలో బెస్ట్ బ్యాటర్ అవార్డు వరించింది.  2022లో సూర్య..  31 మ్యాచ్ లలోనే 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలర్ల జాబితాలో  వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.  భువీ.. 32 మ్యాచ్ లలో 37 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios