Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ నిరవధిక వాయిదా: బీసీసీఐ సంచలన నిర్ణయం

మళ్లీ నోటీసులు జారీ చేసేంత వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. 
bcci officially suspends ipl-2020 due to covid 19 pandemic
Author
Mumbai, First Published Apr 16, 2020, 7:16 PM IST
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతంలో ఏప్రిల్ 15 వరకు ఇండియాలో లాక్‌డౌన్ ఉండటంతో ఆ తర్వాత పరిస్ధితులు అదుపులోకి వచ్చి టోర్ని జరుగుతుందని అంతా భావించారు.

కానీ రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. దీంతో ఐపీఎల్ సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలే మళ్లీ నోటీసులు జారీ చేసేంత వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు గురువారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. అలాగే దేశంలో క్రికెట్‌ను ఎప్పుడు పునరుద్దరిస్తారని ప్రశ్నించగా.. దీనిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలతో కలిసి నిరంతరం సమీక్ష  నిర్వహిస్తున్నామని షా తెలిపారు.

బీసీసీఐ తాజా నిర్ణయం కారణంగా సెప్టెంబర్- నవంబర్ మధ్య విండో మాత్రమే ఖాళీగా ఉంది. అప్పుడైనా సరే సీజన్ ఆరంభించాలంటే దుబాయ్‌లో జరిగే ఆసియా కప్‌కు భారత జట్టు దూరమవ్వాల్సి వుంటుంది.

లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తర్వాత ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్, స్పాన్సర్స్‌తో బీసీసీఐ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అందరి ఆమోదంతోనే ఐపీఎల్‌ 2020 సీజన్‌ని నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే.. బీసీసీఐ సుమారు రూ.3,869.5 కోట్లు నష్టపోనుందని ఓ అంచనా. 
Follow Us:
Download App:
  • android
  • ios