బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో రాయల్స్ చాలెంజర్స్ ,సన్ రైజర్స్ మ్యాచ్ లో కోహ్లీ, అంపైర్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కీలక సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్  తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో బౌలర్ ఉమేశ్ యాదవ్, కెప్టెన్ కోహ్లీ  ఇదేంటని ప్రశ్నించారు. తనను  అలా నిలదీయడంతో కోపోద్రిక్తుడైన అంపైర్ వారిపై కసురుకున్నాడు. ముఖ్యంగా కోహ్లీ-అంపైర్ ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరగా అంపైరింగ్ పై వున్న గౌరవంతో కోహ్లీ కాస్త వెనక్కితగ్గాడు. 

అయితే అంతటితో ఈ వివాదం సద్దుమణిగినా అంపైర్ కోపం మాత్రం తగ్గలేదు. తనతో ఆటగాళ్లు వాగ్వాదానికి దిగడంతో కోపంతో ఊగిపోయిన లాంగ్ విపరీతంగా ప్రవర్తించాడు. స్టేడియంలోని ఓ గది తలుపును కోపంగా తన్నడంతో అదికాస్తా విరిగిపోయింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న స్టేడియం అధికారులు అంపైర్ పై బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై బిసిసిఐ కూడా వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. దీంతో లాంగ్ పై కఠిన చర్యలుంటాయని అందరూ భావించారు. 

బిసిసిఐ మాత్రం అంపైర్ లాంగ్ పై చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేసింది. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బిసిసిఐ తాజాగా వెల్లడించింది. దీంతో ఆదివారం హైదరాబాద్ వేదికన జరగనున్న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ కు లాంగ్ యధాప్రకారం అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. క్రికెట్ పాలక మండలి ఐపిఎల్ అధికారులతో చర్చించి తర్వాతే ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేసేందుకు అనుమతినిచ్చిందని అధికారులు వెల్లడించారు. 

ఏం జరిగిందంటే:

చిన్న స్వామి స్టేడియంలో లీగ్ దశలో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్సిబి,సన్ రైజర్స్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ బ్యాట్ మెన్స్ ను ఆర్సిబి బౌలర్లు తక్కువ పరుగులకే అడ్డుకోవడంలో సఫలమయ్యారు. అయితే ఉమేశ్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో మాత్రం కెప్టెన్ విలియమ్సన్ చెలరేగాడు. వరుస బంతుల్లో అతడు సిక్సులు, ఫోర్లతో చెలరేగుతున్న సమయంలో అంఫైర్ నిగెల్ లాంగ్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో ఉమేశ్ వేసిన ఓ బంతిని నోబాల్ గా ప్రకటించి సన్ రైజర్స్ కు ఫ్రీ హిట్ ఇచ్చాడు. దీంతో ఉమేశ్ యాదవ్ తో పాటు కెప్టెన్ కోహ్లీ అసహనానికి గురై ఆ నిర్ణయం గురించి అంఫైర్ ను ప్రశ్నించారు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా కోపంగా వారిని కసురుకున్నాడు.

అయితే రిప్లేలో మాత్రం ఉమేశ్ సక్రమంగానే బాల్ వేసినట్లు తేలింది. ఈ క్రమంలో అంపైర్ ఫీల్డ్ లోంచి బయటకు వచ్చాక కూడా కోపంగానే వున్నాడు. ఈ కోపంలోనే మైదానంలోని ఓ గది తలుపును తన్ని విరగ్గొట్టాడు. దీంతో స్టేడియం అధికారులు బిసిసిఐ కి ఫిర్యాదు చేశారు.