Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 22న బిసిసిఐ ఎన్నికలు: ప్రకటించిన సీఓఏ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటుచేయడానికి క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్(సీఓఏ) సిద్దమయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 22న బిసిసిఐకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఓఏ తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.    

BCCI elections to be held on October 22
Author
Mumbai, First Published May 21, 2019, 4:02 PM IST

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన పాలకవర్గాన్ని ఏర్పాటుచేయడానికి క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్(సీఓఏ) సిద్దమయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 22న బిసిసిఐకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఓఏ తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.    

బిసిసిఐ నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు రెండేళ్ళ క్రితం ప్రత్యేకంగా సీఓఏ ను నియమించింది. వినోద్ రాయ్  ఈ కమిటీకి చీఫ్‌గా, డ‌యానా ఎడుల్జీ, లెఫ్టినెంట్‌ జ‌న‌ర‌ల్ ర‌వి తోగ్డేలు స‌భ్యులుగా న్యాయస్థానం చేత నియమింపబడ్డారు. బిసిసిఐ కి చెందిన పూర్తి అధికారాలను  వారికి అప్పగించారు. దీంతో అప్పటినుండి భారత క్రికెట్ కు సంబధించిన ఏ విషయాన్నయినా ఈ కమిటీనే చూసుకుంటోంది.  

అయితే సుప్రీంకోర్టు నియమించిన సీఓఏ పాలనను ఆపాలని...  ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని పీఎస్ న‌ర్సింహా క‌మిటీ ఓ రిపోర్టును రూపొందించింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చలుమ జరిపిన ఈ కమిటీ...చివరకు బిసిసిఐకి ఎన్నికలు  నిర్వహించి అధికారాన్ని నూతన బోర్డుకు అప్పగించాలని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సీఓఏ బిసిసిఐ ఎన్నికలను నిర్వహించడానికి సిద్దమైంది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios