కోల్‌కతా: భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది.  తాజాగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శ స్నేహసిష్ గంగూలీ కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన బెల్లీ వ్యూ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా టీమిండియా  మాజీ కెప్టెన్ గంగూలీ హోంక్వారంటైన్ లోకి వెళ్లారు.  

కొద్దిరోజులుగా స్నేహసిష్ కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడు చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరగా కుటుంబసభ్యులు హోంక్వారంటైన్ లోకి వెళ్లారు.  

ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు బిసిసిఐ  అధికారులు తెలిపారు. ఆయన కేవలం ఫోన్ లో మాత్రమే అందుబాటులో వుంటారని... ప్రత్యక్షంగా కలవడం కుదరదని వెల్లడించారు.

read more  కోవిడ్ తరువాత క్రీడలకు దిశా నిర్దేశం

ఇప్పటికే కోవిడ్ 19 బారినపడి మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 53 ఏళ్ల సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్ధాంత్ .. రాజస్థాన్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతుండగా.. చిన్న కుమారుడు ఎకాన్ష్ అండర్-23 జట్టులో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు.

 క్లబ్ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంజయ్...అండర్- 23 జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌గా సేవలందించారు. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా సోకింది. ఇప్పటికే ధీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో దోబల్ కోవిడ్ 19 బారినపడ్డారు. చివరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

మరోవైపు ఫ్లాస్మా థెరపీ చేయించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన సన్నిహితుడు తెలిపారు. మరోవైపు సంజయ్ మృతిపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.