Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరికి స్థానం కల్పించారంటే? 

స్వదేశంలో స్వంత గడ్డపై న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాతో  జరిగే జరగనున్న సిరీస్‌లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా- భారత్ ల మధ్య  4 టెస్టు మ్యాచ్ లు జరుగనున్నాయి.  అదే సమయంలో, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9 నుండి నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ.. తొలి రెండు టెస్టులకు మాత్రమే  టీమ్ ఇండియాను ప్రకటించింది.

BCCI Announces Squad For New Zealand And Australia Series
Author
First Published Jan 14, 2023, 3:09 AM IST

స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న సిరీస్‌లకు సంబంధించి బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. ఈ సిరీస్‌లకు సంబంధించి పలు మార్పులు చోటుచేసుకున్నాయి.  ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఉండగా తొలి రెండు టెస్టులకు సంబంధించి సెలక్షన్‌ కమిటీ  ఆటగాళ్లను ప్రకటించింది.

తొలిసారి సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లకు టెస్టు టీంలో స్థానం కల్పించారు సెలెక్టర్స్.  ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన పృథ్వీ షాకు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే.. పర్సనల్ రీజన్స్ తో కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ న్యూజిలాండ్‌ టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యారు. దీంతో మరోసారి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వహించనున్నాడు. 

అదే సమయంలో కీపర్‌ గా యంగ్ అండ్ న్యూ ఫ్లేయర్ కేఎస్‌ భరత్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు, ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. మరోవైపు..గాయంతో కారణంగా టీమిండియాకు దూరమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఆస్ట్రేలియా తో రెండు టెస్ట్‌లకు ఎంపిక చేశారు.అయితే.. అతని ఫిట్‌నెస్‌ను బట్టి బరిలోకి దిగే అవకాశం ఉంది.   
  
న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ మొదలు కానుంది. మొదటి మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా, రెండో మ్యాచ్ 21న రాయ్‌పుర్‌, మూడో మ్యాచ్ 24న ఇండోర్‌లో వన్డేలు జరగనున్నాయి.  ఇక న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ జనవరి 27 న ప్రారంభం కానుంది. వరుసగా.. రాంచీ, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం.. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పుర్‌ వేదికగా ఆసీస్‌తో తొలి టెస్టు జరగనుంది.  

 ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికె), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్

గమనిక: రవీంద్ర జడేజాకు ఫిట్‌నెస్‌కు లోబడి  జట్టులో స్థానం కల్పిస్తారు.  

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌..

వన్డే జట్టు: రోహిత్ శర్మ  (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ , Mohd. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌..

T20I జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), R గైక్వాడ్, శుబ్మాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, Y చాహల్, అర్ష్దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్. 

Follow Us:
Download App:
  • android
  • ios