సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లను పట్టించుకోని సెలక్టర్లు... ఆసియా కప్ 2022 జట్టులో స్వల్ప మార్పులు... బుమ్రా, హర్షల్ పటేల్ రీఎంట్రీ...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. గాయం కారణంగా రవీంద్ర జడేజా, టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్‌గా ఎంచుకున్న భారత జట్టు, రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇచ్చింది....

జ్వరంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన ఆవేశ్ ఖాన్‌ని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించిన బీసీసీఐ సెలక్టర్లు, యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ని పొట్టి ప్రపంచకప్ 2022 టోర్నీకి ఎంపిక చేశారు.

సంజూ శాంసన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేసినా, వాటిని పెద్దగా పట్టించుకోలేదు సెలక్టర్లు. అలాగే ఐపీఎల్ 2022 టోర్నీలో 150+ కి.మీ.ల వేగంతో నిప్పులు చెదిరే బంతులతో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్‌ని కూడా పట్టించుకోలేదు సెలక్టర్లు.

Scroll to load tweet…

టీ20 వరల్డ్ కప్ 2022 జట్టుకి భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

వీరితో పాటు మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్‌లక స్టాండ్ బై ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించారు.

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీకి స్టాండ్ బై ప్లేయర్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు కల్పించిన సెలక్టర్లు, గాయం కారణంగా ఈ ఏడాది ఎక్కువ మ్యాచులకు దూరమైన దీపక్ చాహార్‌ని కూడా స్టాండ్ బై ప్లేయర్‌గా ఆస్ట్రేలియా పంపించబోతున్నారు...

స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో అక్షర్ పటేల్, అతని స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టోర్నీలకు కూడా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌ల్లో మహ్మద్ షమీ, దీపక్ చాహార్‌లకు తుదిజట్టులో అవకాశం దక్కింది...

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపికైన భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉంటారు. ఇదే సమయంలో అర్ష్‌దీప్ సింగ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌కి దూరంగా ఉంటాడు. మహ్మద్ షమీ, దీపక్ చాహార్ ఈ రెండు సిరీస్‌ల్లో పాల్గొంటారు.