ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ జట్టులో చోటు సంపాదించుకోగా, గత మ్యాచ్‌లో గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవ్‌దీప్ సైనీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సిడ్నీ మ్యాచ్ ద్వారా సైనీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేయనున్నాడు.

రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ, రెండు టెస్టుల్లోనూ విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను జట్టు నుంచి తప్పించింది. రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తానని స్పష్టం చేశాడు భారత తాత్కాలిక సారథి అజింకా రహానే. రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నాడు. వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్‌లో అజింకా రహానే, ఆ తర్వాత హనుమ విహారి, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి వస్తారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉండగా.. బుమ్రా, సిరాజ్, సైనీ పేసర్లుగా ఉన్నారు.

మూడో టెస్టుకి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, సిరాజ్, నవ్‌దీప్ సైనీ