క్రికెట్ లో వింతలు, విశేషాలు జరగడం కామనే గానీ ఇదైతే మరీ దారుణం.  ప్యాడ్స్ కట్టుకోకుండా క్రీజులోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచడమే గాక తానూ ఆశ్చర్యపోయాడు ఓ బ్యాటర్.

యుద్ధరంగంలో సైనికుడికి యుద్ధం చేయడానికి కత్తి ఎంత అవసరమో తనను తాను రక్షించుకోవడానికి డాలు కూడా అంతే అవసరం. క్రికెట్ లో కూడా అంతే. తాపీగా బ్యాట్ తీసుకుని వచ్చి క్రీజులో నిల్చుంటానంటే కుదరదు. అవతల బౌలింగ్ చేసేవాడు ఏ ఉమ్రాన్ మాలికో, షోయభ్ అక్తరో అయితే అంతే సంగతులు. బ్యాట్ తో పాటు తనను తాను రక్షించుకోవడానికి హెల్మెట్, గార్డ్, ప్యాడ్స్, గ్లోవ్స్ కూడా ధరించాల్సిందే. అయితే ఇక్కడ ఓ బ్యాటర్ మాత్రం ప్యాడ్స్ కట్టుకోకుండానే క్రీజులోకి వచ్చాడు. అతడికి భయం లేదు కాబోలు.. అందుకే వచ్చాడని అనుకుంటున్నారేమో.. అంతలేదు. అతడు క్రీజులోకి వచ్చింది ప్యాడ్స్ కట్టుకోవడం మరిచిపోయి..

క్రికెట్ లో వింతలు, విశేషాలు జరగడం కామనే గానీ ఇదైతే మరీ దారుణం. ప్యాడ్స్ కట్టుకోకుండా క్రీజులోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరచడమే గాక తానూ ఆశ్చర్యపోయాడు ఓ బ్యాటర్. ఈ విచిత్రమైన ఘటన జరిగింది క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ లో. 

ఇంగ్లాండ్ లోని సౌతెండ్ సివిక్ క్రికెట్ క్లబ్ కు చెందిన మార్టిన్ హ్యూగ్స్.. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్ లో హడావిడిగా క్రీజులోకి వచ్చాడు. అతడు కాళ్లకు ప్యాడ్స్ కట్టుకోవడం మరిచిపోయాడు. ఆ సంగతి ప్రత్యర్థి జట్టులోని ఆటగాడు చెప్పేదాకా అతడికి తెలియరాలేదు. దీంతో అతడు తన తప్పు తెలుసుకుని మళ్లీ డగౌట్ కు పోలోమని పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

Scroll to load tweet…

దీనిపై పలువురు నెటిజన్లు తాము కూడా గతంలో ఇలాగే చేసినట్టు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్యాడ్స్ ఒక్కటే గాక గ్లోవ్స్, గార్డ్ కూడా పెట్టుకోకుండా క్రీజులోకి వచ్చిన తమకు ‘తాకిన గాయాల’ గురించి ప్రపంచానికి చెబుతున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

అయితే ఓ యూజర్ మాత్రం మార్టిన్ అలా హడావిడిగా ప్యాడ్స్ కూడా కట్టుకోకుండా రావడంలో అతడి తప్పేమీ లేదని కామెంట్ చేశాడు. అప్పటికే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోవడంతో అతడు ప్రిపేర్ అవడానికి టైం లేకుండా పోయిందని కామెంట్ చేశాడు.