Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాతో వన్డే సిరీస్.. తొలి మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా..

BANvsIND: బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు నేటి నుంచి ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. తొలి వన్డేలో టీమిండియా సారథి  రోహిత్ శర్మ టాస్ ఓడాడు.  ఈ మ్యాచ్ లో  లిటన్ కుమార్  దాస్ సారథ్యంలోని బంగ్లా జట్టు తొలుత బౌలింగ్  చేయనుంది. 
 

BANvsIND 1st ODI: Bangladesh Won The Toss Elected Bowl First
Author
First Published Dec 4, 2022, 11:08 AM IST

వన్డే ప్రపంచకప్ - 2023  దృష్టిలో ఉంచుకుని 50 ఓవర్ల ఫార్మాట్ లో లక్ష్యాలు నిర్దేశించుకున్న టీమిండియా  ఆ మేరకు  మరో సిరీస్  ఆడనుంది.  న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత  బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ తొలుత మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడుతున్నది. ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. బంగ్లాదేశ్  టాస్ గెలిచి తొలుత బౌలింగ్  చేయనుంది. భారత్ బ్యాటింగ్ కు రానుంది. వన్డే సిరీస్ కు ముందు బంగ్లా వన్డే సారథి  తమీమ్ ఇక్బాల్  కు గాయం కావడంతో లిటన్ కుమార్ దాస్ సారథ్యం వహిస్తున్నాడు. 

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్ లో  భారత్  టీ20 ప్రపంచకప్ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్నది.  న్యూజిలాండ్ పర్యటనకు  విరామం తీసుకున్న  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఈ  సిరీస్ తో తిరిగి జట్టుతో చేరారు. 

బౌలింగ్ లో సీనియర్ పేసర్లు  బుమ్రా, షమి అందుబాటులో లేకపోవడంతో టీమిండియా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్ లతోనే ఈ సిరీస్ లో బరిలోకి దిగుతున్నది. మరి బంగ్లా బ్యాటర్లను ఈ యువపేసర్లు ఏ మేరకు  నిలువరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం.  అయితే తొలి వన్డేలో  సిరాప్, దీపక్ చాహర్, శార్దూల్ తో పాటు ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన కుల్దీప్ సేన్ భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. ఉమ్రాన్ మాలిక్ కు  తుది జట్టులో చోటు దక్కలేదు. 

తుది జట్లు :  

ఇండియా :  రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ , వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్  చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్ 

బంగ్లాదేశ్: లిటన్ దాస్ (కెప్టెన్), అన్ముల్ హక్, నజ్ముల్ హోసేన్, షకిబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హుస్సేన్, మెహిది హసన్,  హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఎబాదత్ హోసేన్ 
 

Follow Us:
Download App:
  • android
  • ios