బంగ్లా క్రికెటర్లు లిట్టన్ దాస్, నయిమ్ హాసన్ ల ఆరోగ్యంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆరా తీశారు. వారి ఆరోగ్యం సరిగా ఉందో లేదో ఆమె కనుక్కున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే....
ప్రస్తుతం టీమిండియా కోల్ కతా వేదికగా... బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 20వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌన్సర్ బంతి ఆడబోయిన లిట్టన్ దాస్.. బంతి అందకపోవడంతో గాయపడ్డాడు. 

వేగంగా వచ్చిన బంతి నేరుగా వెళ్లి లిట్టన్ దాస్ హెల్మెట్‌కి బలంగా తాకడంతో అతను బ్యాటింగ్‌ని కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన నయిమ్ హసన్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే బౌన్సర్‌ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి నయిమ్ చెవి భాగంలో హెల్మెట్‌కి తాకింది. దీంతో.. నయిమ్ అస్వస్థతకు గురయ్యాడు.

ఆ ఇద్దరు క్రికెటర్లకు ఫిజియో తగిన వైద్యం అందించారు. అయితే... ప్రస్తుతం వారి ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆరా తీశారు.