భర్త కోసం భార్య కోర్టుకి వెళ్లడం కామన్, భార్య కోసం భర్త కోర్టుకి వెళ్లడం వెరైటీ. బంగ్లాదేశ్ లాంటి ఇస్లాం మతస్థుల దేశంలో అయితే ఇంకా వెరైటీ. ఇలాంటి వింత కేసులోనే ఇరుక్కున్నాడు బంగ్లాదేశ్ క్రికెటర్ నాసీర్ హుస్సేన్..

భర్త కోసం భార్య కోర్టుకి వెళ్లడం కామన్, భార్య కోసం భర్త కోర్టుకి వెళ్లడం వెరైటీ. బంగ్లాదేశ్ లాంటి ఇస్లాం మతస్థుల దేశంలో అయితే ఇంకా వెరైటీ. ఇలాంటి వింత కేసులోనే ఇరుక్కున్నాడు బంగ్లాదేశ్ క్రికెటర్ నాసీర్ హుస్సేన్.. 2011లో బంగ్లాదేశ్ తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన నాసీర్ హుస్సేన్, 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20 మ్యాచులు ఆడాడు. ఓవరాల్‌గా రెండు సెంచరీలతో 2500+ పైగా పరుగులు చేశాడు...

దాదాపు మూడేళ్లుగా బంగ్లా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న నాసీర్ హుస్సేన్, 2021లో తమీమా సుల్తానా అనే ఎయిర్ హోస్టెస్‌ను ప్రేమించి పెళ్లాడాడు...
గత ఏడాది సరిగ్గా వాలెంటైన్స్ డే రోజునే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే తమీమా సుల్తానాకి అప్పటికే పెళ్లైంది. దీంతో ఆమె భర్త, హుస్సేన్‌పై కేసు వేశాడు...

తమీమా సుల్తానా ఇంకా తనకు విడాకులు ఇవ్వలేదని, మరొకరి పెళ్లాన్ని మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటాడని ఆరోపిస్తూ నాసిర్ హుస్సేన్‌పై కోర్టుకెళ్లాడు ఆమె భర్త రకీబ్ హసన్...
విడాకులు తీసుకోని పెళ్లైన మహిళను మళ్లీ వివాహం చేసుకున్నట్టుగా రుజువైతే, బంగ్లా క్రికెటర్‌కి అక్కడి శిక్షాస్మృతి ప్రకారం ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది...

భర్తతో విడాకులు తీసుకున్నట్టుగా విడాకుల పత్రాలకు ఫోర్జరీ చేసిన తమీమా సుల్తానాపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఒకవేళ తప్పు రుజువైనా కూడా భర్త ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న సుల్తానాకి పెద్దగా శిక్ష పడే అవకాశం లేదు...

‘తమీమా సుల్తానా, రకీబ్ హసన్‌కీ విడాకులు కాలేదు. అయితే క్రికెటర్ నాసీర్ హుస్సేన్‌తో పరిచయం అయిన తర్వాత తమీమా సుల్తానా, భర్తకు తెలియకుండా అతన్ని కలుస్తూ ఉండేది. అలా అతనికి తెలియకుండానే తప్పుడు విడాకుల పత్రాలు సృష్టించి, రెండో పెళ్లి చేసుకుంది. భర్త సంతకాన్ని, పోస్టల్ పత్రాలను ఫోర్జరీ చేసి... విడాకులు తీసుకున్నట్టుగా నమ్మించింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు రకీబ్ హసన్ తరుపు న్యాయవాది ఇస్రత్ హసన్..

‘బంగ్లాదేశ్‌లో ఇలాంటి కేసులు చాలా అరుదు. అదీకాకుండా తప్పుచేసినట్టు నిరూపించడం చాలా కష్టం. తమీమా సుల్తానా, నాసీర్ హుస్సన్‌ మధ్య అనుబంధం అక్రమమైనదిగా నిరూపించడం సాధ్యం కాదు...’ అంటూ తెలిపాడు క్రికెటర్ నాసీర్ హుస్సేన్, తమీమా సుల్తానాల తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది ఫకీరుద్దీన్ ఖాన్...

అయితే క్రికెటర్ నాసీర్ హుస్సేన్, తమీమా సుల్తానాల తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది ఫకీరుద్దీన్ ఖాన్, విడాకులకు సంబంధించిన పత్రాలను కోర్టులో సమర్పించేందుకు మార్చి 10 వరకూ గడువు కోరడం విశేషం...

బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్)లో కుల్నా రాయల్ బెంగాల్, షిలెట్ సిక్సర్స్, ఛిట్టగాం ఛాలెంజర్స్ తరుపున ఆడిన నాసీర్ హుస్సేన్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5 వేలకు పైగా పరుగులు, 76 వికెట్లు పడగొట్టాడు. వరుసగా ఫెయిల్ అవుతుండడంతో బంగ్లా క్రికెట్ జట్టులో చోటు కోల్పోయాడు నాసీర్ హుస్సేన్. చివరిగా శ్రీలంకపై 2018 ఆగస్టులో వన్డే మ్యాచ్ ఆడాడు నాసీర్ హుస్సేన్..