Asianet News TeluguAsianet News Telugu

ఏ బిడ్డా ఇది మా అడ్డా.. ఇంగ్లాండ్‌కు ట్రిపుల్ స్ట్రోక్.. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్.. చరిత్ర సృష్టించిన బంగ్లా

BANvsENG: సొంతగడ్డపై తమ  ఆట ఎలా ఉంటుందో   మరోసారి బంగ్లాదేశ్ నిరూపించింది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును టీ20లలో ఏకంగా  క్లీన్ స్వీప్ చేసింది.  

Bangladesh beat England in 3rd T20I and clean Sweep The Series MSV
Author
First Published Mar 14, 2023, 6:29 PM IST

గతేడాది నవంబర్ లో  ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20  ప్రపంచకప్ లో  విశ్వవిజేతగా నిలిచి  వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచిన   ఇంగ్లాండ్ కు  బంగ్లాదేశ్ కలలో కూడా ఊహించని షాకిచ్చింది.  స్వదేశంలో ఇంగ్లాండ్ ను షకిబ్ సేన.. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.  ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న  బంగ్లా.. తాజాగా మూడో టీ20లో కూడా గెలిచి  ఇంగ్లాండ్ కు ట్రిపుల్ షాక్ ఇచ్చింది.  బంగ్లాదేశ్  పై ఇంగ్లాండ్ కు ఇదే  తొలి క్లీన్ స్వీప్ విజయం. 

ఢాకా వేదికగా షేర్ ఏ బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన   మూడో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన  బంగ్లాదేశ్..  2 వికెట్ల నష్టానికి  158 పరుగులు చేసింది.  ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73, 10 ఫోర్లు, 1 సిక్స్) తో పాటు శాంతో  (36 బంతుల్లో 47 నాటౌట్, 1 ఫోర్ , 2 సిక్సర్ల)  రాణించారు.  బంగ్లా బ్యాటర్లను ఔట్ చేయడానికి ఇంగ్లాండ్ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా  అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ లు మాత్రమే తలా ఓ వికెట్ తీశారు.  

ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేసింది.   ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ తాను ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ కాగా మరో ఓపెనర్ డేవిడ్ మలన్ (53),  కెప్టెన్ జోస్ బట్లర్ (31 బంతుల్లో 40, 4 ఫోర్లు, 1 సిక్స్) లు రెండో వికెట్ కు 95 పరుగులు జోడించారు.  

 

సాఫీగా సాగుతున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్  ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.   14వ ఓవర్ వేసిన  ముస్తాఫిజుర్..  తొలి బంతికి  డేవిడ్ మలన్ ను ఔట్ చేశాడు. అదే ఓవర్లో రెండో బంతికి   మెహది హసన్ మిరాజ్ వేసిన  త్రో తో రనౌట్ అయ్యాడు. కొద్దిసేపటికే   మోయిన్ అలీ  (9), సామ్  కరన్ (4) కూడా పెవిలియన్ బాట పట్టారు. 

13వ ఓవర్ ప్రారంభానికి ముందు 100-1 గా ఉన్న ఇంగ్లాండ్ స్కోరు.. 17 ఓవర్లు ముగిసేటప్పటికీ   123-5గా మారింది.  చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉండగా  18వ ఓవర్ వేసిన  ముస్తాఫిజుర్ ఐదు పరుగులే ఇచ్చాడు.  షకిబ్ వేసిన 19వ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో  27  పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్ పది పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లా.. 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios