బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్)లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ముంబై తమ ముందు ఉంచిన 188 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లలో పటేల్ 31, అలీ 13, కోహ్లీ 46, డెవీలియర్స్ 70, హెట్‌మెయిర్ 5 పరుగులు చేశారు.
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముంబై జట్టులో డికాక్(23), రోహిత్ శర్మ 48, యువరాజ్(23), సూర్యకుమార్ యాదవ్(38) హార్థిక్ పాండ్యా(32) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4, ఉమేశ్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.

వస్తూనే హ్యాట్రిక్స్ సిక్సర్లతో చెలరేగి ఆడిన ముంబై ఇండియన్స్ బ్యాట్ మెన్ యువరాజ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. చాహల్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగిన యువరాజ్ నాలుగో బంతిని కూడా బౌండరీ బాదడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. 

ఐపీఎల్ 2019లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు రెండు మార్పులు చేసింది. లసిత్ మలింగ, స్పిన్నర్ మయాంక్ మార్కెండే జట్టులోకి వచ్చారు.

ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. డీకాక్, రోహిత్ శర్మ జోడీ వికెట్ల వద్ద పాతుకుపోతుండటంతో రంగ ప్రవేశం చేసిన చాహల్.. డీకాక్‌ను పెవిలియన్‌కు పంపాడు. డీకాక్ 23 పరుగులు చేశాడు. 

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తృుటిలో హాఫ్ సెంచరి మిస్ చేసుకున్నాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేశ్ బౌలింగ్‌లో అతను పెవిలియన్ చేరాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో8 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 

వరుస బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్.. అదే ఊపులో చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై నాలుగో వికెట్‌ను చేజార్చుకుంది. చాహల్ బౌలింగ్‌లో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు.విధ్వంసక ఆటగాడు పొలార్డ్ .. జట్టు స్కోరు పెంచే క్రమంలో చాహల్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.

ముంబై స్వల్ప వ్యవధిలో మరో వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద నవదీప్‌కు దొరికిపోయాడు.చివర్లో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు విజృంభించడంతో ముంబై వెంట వెంటనే వికెట్లు కోల్పోతోంది. సిరాజ్ బౌలింగ్‌లో 1 పరుగుకే మిచెల్ మెక్లెంగన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడుముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్కండే.. సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ముంబై ఇండియన్స.. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ముందు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు, ఉమేశ్ యాదవ్, సిరాజ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.