Asianet News TeluguAsianet News Telugu

మీకంటే ఆ పిల్లాడు బాగా క్యాచ్ పట్టాడు కదా భయ్యా... భారత ఫీల్డింగ్‌పై ట్రోలింగ్...

మొదటి వన్డేలో మూడు క్యాచులను నేలపాలు చేసిన భారత ఫీల్డర్లు... ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన సిక్సర్‌ని చూడచక్కని క్యాచ్‌గా అందుకున్న బాల్ బాయ్... వీడియో వైరల్... 

Ball boy takes superb catch in bounder line, team India fielders gets trolls for dropping catches
Author
First Published Oct 7, 2022, 11:47 AM IST

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 9 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. బ్యాటింగ్‌కి కష్టంగా ఉన్న పిచ్‌పై భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించారు. 22.2 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసిన సౌతాఫ్రికా... 40 ఓవర్లలో 249 పరుగులు చేయగలిగింది. సఫారీ ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 ఓవర్లలో 55 పరుగులు వచ్చాయి...


శార్దూల్ ఠాకూర్ 8 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ 8 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వగా తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న రవి భిష్ణోయ్ 8 ఓవర్లలో 69 పరుగులు సమర్పించి ఓ వికెట్ మాత్రమే తీయగలిగాడు...

మహ్మద్ సిరాజ్ 8 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. బౌలర్ల పర్ఫామెన్స్ పర్వాలేదనిపించినా సౌతాఫ్రికా బ్యాటర్లు ఇచ్చిన క్యాచులను భారత ఫీల్డర్లు జారవిడిచారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచులు నేలపాలు చేయడం విశేషం..

ఆవేశ్ ఖాన్ వేసిన 38వ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసిన్ ఇచ్చిన క్యాచులను మహమ్మద్ సిరాజ్, రవి భిష్ణోయ్ అందుకోలేకపోయారు. 

అదే ఓవర్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ నెత్తి మీదుగా ఓ సూపర్ సిక్సర్ బాదాడు డేవిడ్ మిల్లర్. బౌండరీ లైన్ బయట ఫీల్డింగ్ చేస్తున్న ఓ బాల్ బాయ్, ఈ సిక్సర్‌ని చక్కగా చేతుల్లోకి క్యాచ్‌గా అందుకున్నాడు. ఆ కుర్రాడు క్యాచ్ పట్టిన విధానం స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లను కూడా సర్‌ప్రైజ్ చేసింది...

భారత ఫీల్డర్ల కంటే ఆ బాల్ బాయ్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ‘క్యాచులను ఎలా అందుకోవాలో ఆ కుర్రాడిని చూసి నేర్చుకోవాలంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

అంతకుముందు భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా ఓ ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఫీల్డింగ్ ఫ్యాన్స్‌ని కంగారుపెడుతోంది.  ఈ మధ్య కాలంలో భారత జట్టు, మిగిలిన జట్ల కంటే ఎక్కువ క్యాచులు వదిలేసింది...

‘భారత జట్టు భారీ లక్ష్యాలు చేసినా వాటిని కాపాడుకోలేకపోతుంటే దానికి కారణం పేలవమైన బౌలింగ్, దారుణమైన ఫీల్డింగే. మనం పాకిస్తాన్‌ని చూసి నవ్వుకుంటాం కానీ, వాస్తవానికి వాళ్ల కంటే మన ఫీల్డర్లే ఎక్కువ క్యాచులను డ్రాప్ చేస్తున్నారు...ఫీల్డింగ్‌లో చేస్తున్న తప్పులు బౌలర్లను దెబ్బ తీస్తున్నాయి. ఆరు క్యాచులు వస్తే అందులో నాలుగు మాత్రమే పట్టుకోగలుతున్నాం. అంటే గెలవడానికి వచ్చే మరో రెండు అవకాశాలను నేలపాలు చేస్తున్నాం... 

భారత జట్టు ఈ మధ్యకాలంలో 75.8 క్యాచులను సక్సెస్‌ఫుల్‌గా అందుకోగలిగింది. శ్రీలంక మాత్రమే 74.3 క్యాచ్ సక్సెస రేటుతో మనకంటే దారుణంగా ఉంది. అయితే వాళ్లు ఆసియా కప్ 2022 టోర్నీలో టాప్ క్లాస్ ఫీల్డింగ్ పర్ఫామెన్స్ చూపించారు...సురేష్ రైనా, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా... గన్ ఫీల్డర్లుగా ఉండేవారు. వీళ్ల ఫీల్డింగ్ చూస్తుంటే... ‘‘వావ్... వాట్ ఏ ఫీల్డర్’ అనుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి వాళ్లు టీమ్‌లో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... 

Follow Us:
Download App:
  • android
  • ios