రెండో రోజు  64.4 ఓవర్ల పాటు సాగిన ఆట... వెలుతురు లేని కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం...విరాట్ కోహ్లీ 44, అజింకా రహానే 29 పరుగులతో క్రీజులో...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి వాతావరణం అడ్డుగా మారుతూనే ఉంది. తొలి రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు పలుమార్లు బ్యాడ్ లైట్ కారణంగా ఆటకు అంతరాయం కలుగుతూ వచ్చింది...

రెండో సెషన్ చివర్లో వెలుతురు సరిగా లేకపోవడంతో 15 నిమిషాలు త్వరగానే ఆటను నిలిపివేసి, టీ బ్రేక్ తీసుకున్నారు అంపైర్లు. ఆ తర్వాత కూడా బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది.

అయితే అప్పటికీ ఆట సజావుగా సాగకపోవడం, లైట్ సరిగా లేని కారణంగా మూడు సార్లు ఆటను నిలిపివేసి, తిరిగి ప్రారంభించిన అంపైర్లు, ఇక ఆట సాధ్యం కాదని రెండో రోజు ఆటను రద్దు చేశారు.
ఆటను నిలిపే సమయానికి 64.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది టీమిండియా.

విరాట్ కోహ్లీ 44, అజింకా రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 34, శుబ్‌మన్ గిల్ 28, పూజారా 8 పరుగులు చేసి అవుట్ కాగా... న్యూజిలాండ్ బౌలర్లలో జెమ్మీసన్, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.