ఇంగ్లాండ్ మాట్లాడడం రాకపోవడం వల్లే బాబర్ ఆజమ్‌, పాక్‌లో బ్రాండ్‌గా ఎదగలేకపోయాడు... ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత కష్టమా... పాక్ కెప్టెన్‌కి బాబర్ ఆజమ్ సూటి ప్రశ్నలు..


ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్ 3లో ఉన్న ఏకైక ప్లేయర్ బాబర్ ఆజమ్. టీ20ల్లో మూడో స్థానంలో బాబర్ ఆజమ్, వన్డేల్లో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో మూడో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్, త్వరలో టాప్ ప్లేస్‌కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి...

ఇండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్, నెం.2 బ్యాటర్ స్టీవ్ స్మిత్... తమ పాయింట్లు కోల్పోతే అది బాబర్ ఆజమ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఇద్దరూ మిగిలిన రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోతే బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌కి ఎగబాకినా ఆశ్చర్యపోనవసరం లేదు...

‘పాకిస్తాన్ టీమ్‌కి ఓ క్యారెక్టర్ అంటూ లేదు. వాళ్లకు మీడియా ముందు ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలీదు. ఇంగ్లీష్ మాట్లాడడం, నేర్చుకోవడం అంత కష్టమా? క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సింది ఉంటుంది. మిగిలిన దేశాల క్రికెటర్లతో మాట్లాడాల్సి ఉంటుంది..

ఎప్పుడూ హిందీలోనే మాట్లాడతా... అని బరి గీసుకుని కూర్చుంటే సరిపోదు. టీవీ ముందు అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే ప్రపంచ దేశాలు మనవైపు చూస్తాయి. బాబర్ ఆజమ్‌కి పాకిస్తాన్‌లో మంచి బ్రాండ్‌ ఉంది. అయితే అతను పాకిస్తాన్‌కి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు మారలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఇంగ్లీష్ రాదు...

కనీసం మిగిలిన టీమ్‌లో ఎవ్వరైనా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతారా? కేవలం నేను, షాహిద్ ఆఫ్రిదీ, వసీం అక్రమ్. మాకు మాత్రమే ఇంగ్లీష్ వచ్చు. మేం కొన్ని బ్రాండ్లకు యాడ్స్ కూడా చేస్తున్నాం... మిగిలిన వాళ్లు, మమ్మల్ని చూసి కుళ్లుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...

షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై బాబర్ ఆజమ్ భిన్నంగా స్పందించాడు. 

‘నేను క్రికెటర్‌ని, నా పని క్రికెట్ ఆడడం. అంతేకానీ ఇంగ్లీష్ టీచర్‌ని కాదు. ఇంగ్లీష్ గల గలా మాట్లాడడానికి. అయితే నేను నేర్చుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపనతో ట్రై చేస్తున్నాను...’ అంటూ కామెంట్ చేశాడు బాబర్ ఆజమ్...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బాబర్ ఆజమ్ చాలా కష్టపడ్డాడు. కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, గుర్రుగా చూస్తూ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు..

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ని డ్రా చేసుకోగలిగింది. ఒకానొక దశలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌ ఫైనల్ బరిలో నిలిచిన పాకిస్తాన్, వరుస పరాజయాలతో రేసు నుంచి తప్పుకుంది. గత డబ్ల్యూటీసీ సీజన్‌లో స్వదేశంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవకుండా ముగించింది బాబర్ ఆజమ్ టీమ్.

బాబర్ ఆజమ్‌ని వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలని పీసీబీ ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ వినబడింది. అయితే ప్రస్తుతానికి ఆ విషయం గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.