Asianet News TeluguAsianet News Telugu

ఆటతో కాదు.. కంటి చూపుతో చంపేస్తా..! జర్నలిస్టుపై బాబర్ సీరియస్.. వీడియో వైరల్

Babar Azam : న్యూజిలాండ్ తో  తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన తర్వాత  బాబర్ విలేకరుల సమావేశానికి వచ్చాడు.  కరాచీల టెస్టు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టెస్టుకు సంబంధించిన వివరాలను ఏకరువు పెట్టాడు.  
 

Babar Azam gives death stare to reporter, Video Went Viral in Social Media
Author
First Published Dec 31, 2022, 3:42 PM IST

పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్  తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆటతో పాటు అతడి వ్యవహార శైలి కూడా  చర్చనీయాంశమవుతున్నది. టీమ్ లో  సీనియర్లను బాబర్ పట్టించుకోడని, అతడికి అహం ఎక్కువని పాకిస్తాన్ క్రికెట్ లో   చర్చ జరుగుతుండగా  మీడియా ముందు  పాక్ సారథి వ్యవహరించే తీరు కూడా   విమర్శలకు తావిస్తున్నది. తాజాగా న్యూజిలాండ్ తో   టెస్టు సిరీస్ సందర్భంగా కూడా బాబర్ తన  వ్యవహార శైలితో మరోసారి వార్తల్లో నిలిచాడు. తనకు నచ్చని ప్రశ్నలు  వేసినవారిని కంటి చూపుతో బెదిరిస్తానన్నట్టుగా  లుక్ ఇచ్చాడు.  

న్యూజిలాండ్ తో  తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన తర్వాత  బాబర్ విలేకరుల సమావేశానికి వచ్చాడు.  కరాచీల టెస్టు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టెస్టుకు సంబంధించిన వివరాలను ఏకరువు పెట్టాడు.  

ఇక ప్రెస్ మీట్ నుంచి వెళ్లపోవడానికి లేస్తుండగా బాబర్ ను ఓ జర్నలిస్టు..  ‘ఇది సరైన పద్ధతి కాదు.  ఇక్కడున్న వాళ్లు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు..’ అని  అడిగాడు. దానికి బాబర్.. ఓరకంట చూస్తూ  అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో  మీడియా మేనేజర్  జోక్యం చేసుకుని మైక్ కట్ చేయడంతో  బాబర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

 

ఇక కరాచీ టెస్టులో తొలుత పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. బదులుగా న్యూజిలాండ్ 612  పరుగుల భారీ స్కోరు చేసింది.   రెండో ఇన్నింగ్స్ లో  పాక్.. 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.  న్యూజిలాండ్  1 వికెట్ కోల్పోయి 61 పరుగులు  సాధించింది. టెస్టు డ్రా గా ముగిసింది. కివీస్ తో సిరీస్ కంటే ముందు పాకిస్తాన్.. ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టులు ఓడి తీవ్ర విమర్శల పాలైంది. అప్పుడు కూడా బాబర్ విలేకరులతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చాయి.  

పాక్ తో మూడో టెస్టులో ఓటమి తర్వాత బాబర్  విలేకరులతో  మాట్లాడుతూ.. మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందంటూ  రమీజ్ రాజాకు చురకలు అంటించాడు.   అంతకుముందు రమీజ్..  ఇంగ్లాండ్ వలే పాక్ కూడా దూకుడైన ఆటను ఆడటం అలవర్చుకోవాలని   సూచించడంతో  బాబర్ ఇలా  స్పందించాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios