గత కొంతకాలంగా బాబర్.. తన మామ కూతురిని ప్రేమిస్తుండగా.. వారికి పెళ్లికి ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. 

పాకిస్తాన్ కెప్టెన బాబర్ ఆజమ్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తర్వలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. సొంత మేనమామ కూతురినే ఆయన పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యింది. కాగా.. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగనుంది. 

గత కొంతకాలంగా బాబర్.. తన మామ కూతురిని ప్రేమిస్తుండగా.. వారికి పెళ్లికి ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. దీంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వచ్చే ఏడాది మొదట్లో వీరి వివాహం జరిపించాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది.

కాగా, బాబర్‌ పెళ్లి విషయమై సహచర ఆటగాడు, పాక్‌ మాజీ కెప్టెన్‌ అజహర్‌ అలీ ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశాడు.కెప్టెన్‌కు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ట్విటర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. 

అయితే అజహర్‌ అలీ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే పాక్‌ కెప్టెన్‌ పెళ్లి విషయమై వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, గత కొద్ది కాలంగా కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న పాక్‌ కెప్టెన్‌.. ఇటీవలే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వెనక్కు నెట్టి వన్డేల్లో వరల్డ్ నెంబర్‌ 1 ర్యాంకును అందుకున్నాడు.