విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. !
Virat Kohli Babar Azam Records: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో బాబర్ అజామ్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. దీంతో బాబర్ ఆజం భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
Babar Azam breaks Virat Kohli's record: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో బాబర్ అజామ్ హాఫ్ సెంచరీ సాధించి టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్ ఫార్మాట్లో తొలి 100 ఇన్నింగ్స్ లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా పాక్ మాజీ కెప్టెన్ రికార్డు సృష్టించాడు. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో బాబర్ అజామ్ ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (74) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (66), ఫకార్ జమాన్ (50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాక్ 19.3 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన షాహీన్ షా అఫ్రిది సేన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో వెనుకంజలో ఉంది.
టీ20ల్లో బాబర్ అజామ్ 35వ హాఫ్ సెంచరీ..
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో బాబర్ అజామ్ అద్భుత హాఫ్ సెంచరీ (57 పరుగులు) సాధించాడు. రెండో మ్యాచ్ లో తన దూకుడు ఇన్నింగ్స్ ను కొనసాగించిన పాక్ మాజీ కెప్టెన్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో తొలి 100 ఇన్నింగ్స్ లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. మాస్టర్ బ్లాస్టర్ రియాక్షన్ ఇదే.. !
టీ20 క్రికెట్ లో 100 ఇన్నింగ్స్ లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్
35 - బాబర్ అజామ్ (పాకిస్థాన్)
34 - విరాట్ కోహ్లీ (భారత్)
25 - రోహిత్ శర్మ (భారత్)
21 - పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)
21 - జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
బియ్యానికి పురుగు పట్టొదంటే ఏం చేయాలి?
అలాగే, 100 ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లిస్టులో బాబర్ ఆజం సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నాడు. ఈ జాబితాలో..
3,663 పరుగులు - విరాట్ కోహ్లీ (భారత్)
3,608 పరుగులు - బాబర్ అజామ్ (పాకిస్థాన్)
3,013 పరుగులు - ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)
2,976 పరుగులు - మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్)
2,773 పరుగులు - రోహిత్ శర్మ (భారత్)
2,766 పరుగులు - జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
2,764 పరుగులు - పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)
`సైంధవ్` డిజాస్టర్ టాక్‌కి కారణాలివే.. వెంకీ జడ్జ్ మెంట్ కోల్పోతున్నాడా? లోపం ఏంటి?