సచిన్ టెండూల్క‌ర్ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ రియాక్ష‌న్ ఇదే.. !

Sachin Tendulkar Deepfake Video: భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమ్‌ను ప్రమోట్ చేస్తున్న డీప్‌ఫేక్ వీడియో వైర‌ల్ గా మారింది. త‌న డీప్‌ఫేక్  వీడియో, వాయిస్ మార్ఫింగ్ గురించి ఆందోళ‌న వ్య‌క్తంచేసిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్.. తప్పుడు సమాచారంపై సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించారు. 
 

Legendary cricketer Sachin Tendulkar's deep fake video goes viral, Sara Tendulkar ; This is the master blaster reaction RMA

Sachin Tendulkar Deepfake Video: డీప్‌ఫేక్  వీడియోలు క‌ల‌కలం రేపుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలకు సంబంధించిన‌ డీప్‌ఫేక్ వీడియోలు వైర‌ల్ గా మారిన నేప‌థ్యంలో చాలా మంది ఈ టెక్నాల‌జీ దుర్వినియోగంపై ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. ర‌ష్మిక మంద‌న్న‌, క‌త్రినా క‌ఫ్ వంటి సినీ తారల‌కు సంబంధించి డీప్‌ఫేక్ వీడియోల‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మైన త‌రుణంలో తాజాగా ఈ లిస్టులో దిగ్గ‌జ క్రికెట్ స‌చిన్ టెండూల్క‌ర్ చేరారు. స‌చిన్ ఒక గేమింగ్ యాప్ ను ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలో క‌నిపంచింది. ఈ యాప్ తో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెబుతూనే.. త‌న కుమార్తె సారా టెండూల్కర్ కూడా దీని నుంచి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అందుకుంటున్న‌ద‌ని అందులో పేర్కొన్న‌ట్టుగా ఉంది. ఈ త‌ప్పుడు ప్ర‌చారంపై టెండూల్క‌ర్ ఆందోళ‌న వ్యక్తంచేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బాధితుడయ్యాడు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఒక వీడియోలో "స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్" అనే గేమింగ్ యాప్‌ను టెండూల్కర్ ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టుగా ఉంది. ఆయ‌న కుమార్తె సారా టెండూల్కర్ దాని నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందుతుందని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ఈ న‌కిలీ వీడియోను ఫ్లాగ్ చేసిన టెండూల్క‌ర్.. ఇలాంటివాటిపై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నాడు. తప్పుడు సమాచారం వ్యాప్తికి వ్యతిరేకంగా అప్రమత్తత, వేగవంతమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు.

India vs Afghanistan: మ‌ళ్లీ నిరాశపరిచిన రోహిత్ శ‌ర్మ‌.. ఇలా అయితే కష్టమే.. !

ఎక్స్ లో తన ఆందోళనలను వ్యక్తం చేసిన స‌చిన్.. ఇటువంటి మోసపూరిత కంటెంట్ పై ఫిర్యాదులు చేయాల‌ని పేర్కొన్నాడు. డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పాత్రను నొక్కిచెబుతూ, సాంకేతికతను కలవరపెట్టే దుర్వినియోగాన్ని ఎత్తిచూపారు. ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ, రాజీవ్ చంద్రశేఖర్, మహారాష్ట్ర సైబర్ బ్రాంచ్ తో పాటు కీలకమైన అధికారులను టెండూల్కర్ ట్యాగ్ చేశారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

 

మహారాష్ట్ర సైబర్ సెల్ ఇన్వెస్టిగేషన్ షురూ..

స‌చిన్ టెండూల్కర్ ఫిర్యాదును అంగీకరించిన మహారాష్ట్ర సైబర్ సెల్ డీప్‌ఫేక్ వీడియోపై దర్యాప్తు ప్రారంభించింది. డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీవ్రతను ఈ చర్య ప్రతిబింబిస్తుంది. ఫేక్ వీడియోను సృష్టించి సర్క్యులేషన్ చేయడం వెనుక ఉన్న నిందితులను గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పింది. 

బియ్యానికి పురుగు పట్టొదంటే ఏం చేయాలి?

డీప్‌ఫేక్ టెక్నాలజీతో పెరుగుతున్న ముప్పు

ఇదివ‌ర‌కు అలియా భట్, ప్రియాంక చోప్రా, ర‌ష్మికా మంద‌న్న‌, క‌త్రినా కైఫ్ ఇప్పుడు స‌చిన్ టెండూల్కర్ కేసు.. ఇవి డీప్‌ఫేక్ టెక్నాలజీ పెరుగుతున్న ముప్పును నొక్కి చెబుతున్నాయి. కేవ‌లం వీరు మాత్ర‌మే కాకుండా చాలా మంది ఇతర రంగాల‌కు చెందిన వారు, ప్రజా ప్రముఖులను కూడా డీప్ ఫేక్ ప్రభావితం చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కలిగే హానిని పరిగణనలోకి తీసుకునీ, డీప్‌ఫేక్‌ల హానికరమైన వినియోగాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ఇది మ‌రింత వేగ‌వంతంగా జ‌ర‌గాల‌ని బాధితులు కోరుతున్నారు.

`సైంధవ్‌` డిజాస్టర్‌ టాక్‌కి కారణాలివే.. వెంకీ జడ్జ్ మెంట్‌ కోల్పోతున్నాడా? లోపం ఏంటి?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios