Asianet News TeluguAsianet News Telugu

సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న అక్షర్ పటేల్... గర్ల్ ఫ్రెండ్ మెహా పటేల్‌తో ఘనంగా వివాహం...

తన గర్ల్‌ఫ్రెండ్ మెహా పటేల్‌తో ఘనంగా అక్షర్ పటేల్ వివాహం... అతిథులుగా మహ్మద్ కైఫ్, జయ్‌దేవ్ ఉనద్కట్... 

Axar Patel married his long time girlfriend Meha patel in Vadodara CRA
Author
First Published Jan 27, 2023, 9:31 AM IST

టీమిండియాలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. కెఎల్ రాహుల్- అథియా శెట్టి వివాహం జరిగిన కొన్ని గంటలకే భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా పెళ్లి పీటలు ఎక్కాడు. గురువారం, వడోదరలో అక్షర్ పటేల్ వివాహం తన గర్ల్‌ఫ్రెండ్ మెహా పటేల్‌తో ఘనంగా జరిగింది..

ఈ వివాహానికి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌తో పాటు సౌరాష్ట్ర క్రికెటర్లు జయ్‌దేవ్ ఉనద్కట్, తదితరులు హాజరయ్యారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్న అక్షర్ పటేల్, నేటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో కూడా పాల్గొనడం లేదు...

అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అక్షర్ పటేల్‌కి చోటు దక్కింది. స్వదేశంలో ఆడిన ప్రతీ టెస్టులోనూ ఐదేసి వికెట్ల ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌, బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో కీలకంగా మారబోతున్నాడు..

పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్షర్ పటేల్, ఇప్పటిదాకా సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం విశేషం. అయితే పెళ్లికి హాజరైన మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, అక్షర్ పటేల్‌కి మ్యారేజ్ విషెస్ చెబుతూ ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ఆ తర్వాత పెళ్లి వేడుకకి హాజరైన బంధుమిత్రులు, క్రికెట్ ఫ్యాన్స్... కళ్యాణ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలెట్టారు..

ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన మెహా పటేల్‌తో అక్షర్ పటేల్‌ చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వడోదరలో న్యూట్రిషన్‌గా పనిచేస్తున్న మెహా పటేల్, అక్షర్ పటేల్ డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుందట. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగత విషయాలను తక్కువగా షేర్ చేసే మెహా పటేల్, డైట్, న్యూట్రిషన్‌కి సంబంధించిన విషయాలను ఎక్కువగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. 

టీమిండియా తరుపున 8 టెస్టులు ఆడిన అక్షర్ పటేల్, 36 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా స్వదేశంలో ఆడిన ప్రతీ టెస్టులోనూ ఐదేసి వికెట్లు తీసి అద్భుత రికార్డు సొంతం చేసుకున్నాడు అక్షర్ పటేల్... 46 వన్డేలు, 39 టీ20 మ్యాచులు ఆడిన అక్షర్ పటేల్ మొత్తంగా వైట్ బాల్ క్రికెట్‌లో 71 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ రాణించగల అక్షర్ పటేల్, మొత్తంగా 4 హాఫ్ సెంచరీలు సాధించాడు...

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ పోరాటం కారణంగా టాపార్డర్ ఫెయిల్ కావడంతో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, 190 పరుగులు చేయగలిగింది...

అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌, రవీంద్ర జడేజా ప్లేస్‌కి కరెక్టు రిప్లేస్‌మెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios