Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మరణం...

ఐపీఎల్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉంటున్న డీన్ జోన్స్...

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ సమాధానాలు...

సడెన్‌గా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన డీన్ జోన్స్...

Australian former cricketer Dean Jones sudden death with cardiac arrest CRA
Author
India, First Published Sep 24, 2020, 4:12 PM IST

క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, క్రికెట్ కామెంటేటర్‌గా ప్రఖ్యాతి చెందిన డీన్ జోన్స్ గుండెపోటుతో మరణించారు. ఆస్ట్రేలియాలోని విక్టోరీయాలో 24 మార్చి, 1961లో జన్మించిన డీన్ జోన్స్... టెస్టు క్రికెట్‌లో అద్బుతమైన రికార్డులు నెలకొల్పాడు. 52 టెస్టులు ఆడిన జోన్స్... 46.55 సగటుతో 3631 పరుగులు చేశారు. 164 వన్డేలు ఆడి 6,068 పరుగులు చేశారు. టెస్టుల్లో 11, వన్డేల్లో 7 శతకాలు బాదిన డీన్ జోన్స్... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 19 వేలకు పైగా, లిస్టు ఏ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేశారు. 

ఐపీఎల్ 2020 కోసం ప్రస్తుతం ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ టీమ్‌తో ఉన్న డీన్ జోన్స్... సోషల్ మీడియాలోనూ తెగ యాక్టీవ్‌గా ఉండేవారు. నిన్న జరిగిన మ్యాచ్‌ అనంతరం కూడా ఓ అభిమాని ఆవేశంగా తిడుతూ వేసిన ట్వీట్‌కు కూడా ఎంతో కూల్‌గా సమాధానం ఇచ్చాడు డీన్ జోన్స్. బెస్ట్ వన్డే బ్యాట్స్‌మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన డీన్ జోన్స్.. నేటి(సెప్టెంబర్ 24) మధ్యాహ్నం కూడా ఎంతో నార్మల్‌గానే కనిపించారు. ఆఫీసుకి వచ్చి అందరినీ పలకరించారు. డీన్ జోన్స్ సెడన్‌గా కుప్పకూలిపోవడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా... గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారణ చేశారు వైద్యులు. 

క్రికెట్ కోచ్‌గా కూడా వ్యవహారించిన డీన్ జోన్స్... పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్టు 2016లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుకు కూడా కోచ్‌గా సేవలు అందించిన డీన్ జోన్స్... పీసీఎల్‌లో కరాచీ కింగ్స్ జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నారు..

Follow Us:
Download App:
  • android
  • ios