ప్రేమించిన వాళ్లను పొందాలంటే ముందు మన ప్రేమను బయటికి చెప్పాలి. ఇవాళ చెబుదాం, రేపు చెబుదాం అని ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతోంది. ఇష్టపడిన అమ్మాయి/ అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఉన్న ఫ్రెండ్‌షిప్ కూడా ఎక్కడ పోతుందోనని కొందరు మనసులోనే దాచుకుంటారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తనకు ఇలాంటి పరిస్ధితే ఎదురైందని చెప్పాడు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన తన గర్ల్ ఫ్రెండ్ వినీ రామన్‌తో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఎప్పటి నుంచో ఆమెను ఇష్టపడుతున్న మ్యాక్సీ తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపాడు. వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎలాంటి టెన్షన్‌కు గురయ్యానో అంతకంటే ఎక్కువ టెన్షన్‌కు లోనైనట్లు మ్యాక్స్‌వెల్ చెప్పాడు.

Also Read:కరోనా కల్లోలం: ఇంటిని ఆసుపత్రికి కోసం ఇచ్చేసిన బాక్సర్

ఒకానొక దశలో ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం కంటే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడటమే సులభమని తనకు అనిపించిందన్నాడు. తమ ఇద్దరి మధ్యా ఎంతో కాలం నుంచి మంచి స్నేహం ఉందని, తాను మానసిక ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు వినీ అండగా నిలిచిందని మ్యాక్స్‌వెల్ గుర్తుచేసుకున్నాడు.

నేనంటో ఎంటో తనకే తెలుసునని.. దీంతో వినీనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరిచే సమయంలో మూడు సార్లు విఫలమయ్యానని, నాలుగు  సార్లు ప్లాన్లు కూడా వేశానని మ్యాక్స్‌వెల్ చెప్పాడు.

ప్లాన్ ఏలో భాగంగా తనను ఓ పార్క్‌ తీసుకెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ అక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడం, పెద్దవాళ్లు వాకింగ్ చేయడం, కుక్కలు అరవడం వంటివి తనను ఇబ్బందికి గురిచేసిందని ఈ హార్డ్ హిట్టర్ తెలిపాడు.

Also Read:హార్దిక్ ఒడిలో నటాషా.. ఇంట్లోనే ఉండండి అంటూ...

ప్లాన్‌ బీలో భాగంగా తనను లంచ్‌కు తీసుకెళ్లి రింగ్ తొడిగి ప్రపోజ్ చేద్దామనుకున్నానని అయితే  అక్కడ తన క్రికెట్ ఫ్రెండ్స్  వుండటం చూసి అమలు చేయలేకపోయానని చెప్పాడు.

ప్లాన్ సీలో భాగంగా గులాబీ పూల మధ్యలో ప్రేమ గురించి చెబుదానుకున్నానని అక్కడా కుదరలేదని గుర్తుచేసుకున్నాడు. ప్లాన్ డీ తప్పక అమలు చేయాల్సిందేనని భావించానని.. పార్క్‌కు వినీని రమ్మని చెప్పాను. ఆమె వచ్చిన వెంటనే మోకాళ్లపై కూర్చొని రింగ్ ఆమెకు తొడిగి ప్రపోజ్ చేశానని చెప్పాడు.

ఆ సమయంలో తన గుండె వంద రెట్లు వేగంగా కొట్టుకుందని, చేతులు వణికాయని మ్యాక్సి చెప్పాడు. అయితే వినీ నా ప్రేమను అంగీకరించడం.. ఆ మధుర క్షణాలు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపాడు.