Asianet News TeluguAsianet News Telugu

World Biggest Six: కోడ్తే బాల్ స్టేడియం అవతల పడాలి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతి పెద్ద సిక్స్ ఇదే..

World Biggest Six: అంతర్జాతీయ క్రికెట్ లో హిట్టర్లు ఎంతమంది ఉన్నా బంతిని స్టేడియం అవతలకు పంపిస్తే మజానే వేరు. సాధారణంగా టీ20ల యుగంలో ఇలాంటివి తరుచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇలాంటి విన్యాసాలు చూడటం చాలా అరుదు. 

Australian cricketer Hilton cartwright hits biggest six in first class cricket creates record
Author
Hyderabad, First Published Sep 26, 2021, 1:23 PM IST

ఒక బ్యాట్స్మెన్ ఎన్ని సింగిల్స్, డబుల్స్, ఫోర్లు కొట్టినా సిక్స్ కొడితే వచ్చే కిక్కే వేరు. క్రికెట్ లో టీ20ల హవా మొదలయ్యాక సిక్స్ ల వర్షం కురుస్తున్నది. ప్రపంచ విధ్వంసకర బ్యాట్స్మెన్ అందరు తమ బలాన్నంతా కూడదీసుకుని సిక్స్ లు కొడుతున్నారు. పొలార్డ్, ధోని, రోహిత్ శర్మ, ఆరోన్ ఫించ్, డివిలియర్స్ వంటి హిట్టర్లెందరో ఇలాంటి ‘మ్యాక్సిమమ్’ సిక్సర్లెన్నింటినో అభిమానులకు రుచి చూపించారు.

అయితే టీ 20, వన్డే లు కాక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక  క్రికెటర్ అతి పెద్ద సిక్సర్ బాదాడు. షెఫీల్ షీల్డ్ 2021 22 టోర్నీలో భాగంగా అడిలైడ్ (ఆస్ట్రేలియా)లో జరిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ హిల్టన్ కార్ట్ రైట్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ 44 వ ఓవర్లో నాలుగో బంతిని బౌలర్ తలమీదుగా స్ట్రెయిట్ సిక్సర్ కొట్టాడు. అమాంతం గాల్లోకి లేచిన ఆ బంతి.. ఎక్కడో పడిందో చూద్దామని అనుకున్నా కెమెరాకు కూడా కనపడలేదు. బంతిని తీసుకొద్దామని వెళ్లిన ఫీల్డర్.. బాల్ ఎక్కడ పడిందో తెలియక అయోమయానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇంతలో బయట నుంచి వెళ్తున్న ఒకతను వచ్చి ఆ ఫీల్డర్ కు బంతి ఇచ్చాడు. కార్ట్ రైట్ బాదిన సిక్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనే అతి పెద్ద సిక్స్ గా క్రీడా పండితులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో 122 బంతుల్లో 69 పరుగులు  చేసిన కార్ట్ రైట్.. 8 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 2017లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఆసీస్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన కార్ట్ రైట్.. ఆసీస్ తరఫున మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. తన చివరి వన్డేను భారత్ పైనే ఆడటం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios