కరోనా దెబ్బ: క్రికెట్ బోర్డులో ముదిరిన ఆర్ధిక సంక్షోభం, సీఈఓ రాజీనామా!

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. బిగ్ 4లలో ఒక్కటైన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ఆర్ధిక కష్టాలు చుట్టేయడంతో రాబర్ట్స్ పై క్రికెట్ ఆస్ట్రేలియా గుర్రుగా ఉంది. 

Australian Cricket Board CEO Resigns, New Interim CEO Appointed

క్రికెట్ ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న సంక్షభం మరింత తీవ్ర రూపం దాల్చింది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ రాజీనామా చేసాడు. ఆయన రాజీనామా చేసిన వెంటనే తాత్కాలిక సీఈఓ గా నిక్ హోక్లే ని నియమించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. 

గత మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎడింగ్స్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టనున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచే రాబర్ట్స్ రాజీనామా గురించి చర్చ నడుస్తుంది. ఆయనకు ఇంకో 18 నెలల పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేసారు. 

కేవలం క్రికెట్ బోర్డు ఒక్కటే కాకుండా దాదాపుగా అన్ని ఆస్ట్రేలియన్ క్రీడా సమాఖ్యల్లో కూడా ఆర్ధిక సంక్షోభం నడుస్తుంది. ఇప్పటికే రెండు క్రీడా సమాఖ్యలకు సంబంధించిన సీఈవోలు రాజీనామా చేసారు. నేషనల్ రగ్బీ లీగ్, రగ్బీ ఆస్ట్రేలియా సీఈవోలు రాజీనామా చేసారు. రాబర్ట్స్ ఇప్పుడు మూడవ వ్యక్తి. 

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. బిగ్ 4లలో ఒక్కటైన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ఆర్ధిక కష్టాలు చుట్టేయడంతో రాబర్ట్స్ పై క్రికెట్ ఆస్ట్రేలియా గుర్రుగా ఉంది. 

ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చేటందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధమైంది. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదాయం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. 

ఆ దెబ్బను పూడ్చుకునేందుకు ఈ ఏడాది ఆఖర్లో భారత్‌తో సిరీస్‌ ద్వారా సుమారు 2000 కోట్ల ఆదాయం దక్కించుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సమాయత్తమవుతున్నప్పటికీ.... 2020-21 వార్షిక ఆదాయాన్ని సీఏ( క్రికెట్ ఆస్ట్రేలియా) తాజాగా చాలా తక్కువ చేసి అంచనాలను రూపొందించింది. 

ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘంతో సీఏ గతేడాది ఓ ఒప్పందం చేసుకుంది. సీఏ వార్షిక ఆదాయంలో 27.5 శాతం ఆటగాళ్లకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇప్పుడు ఆదాయ అంచనాలను 40-50 శాతం కుదించటంతో క్రికెటర్ల వాటా కూడా భారీగా పడిపోనుంది. 

దీంతో వార్షిక కాంట్రాక్టుల్లో 25-30 శాతం కోత విధించే ప్రమాదం కనిపిస్తోంది. సీఏ ఆదాయ అంచనాలపై ఏసీఏ(ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్) మండిపడింది. ఏ కొలమానాలతో ఆదాయ అంచనాలను భారీగా కుదించారో తెలపాలని డిమాండ్‌ చేసింది. వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మరోసారి అంచనాలు రూపొందించాలని సీఏను క్రికెటర్ల సంఘం కోరింది.

ఇకపోతే ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ వాయిదా, దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వాయిదా అనివార్యంగా కనబడుతుంది. దీనిపై ఐసీసీ ఇంకా అధికారికంగా ఐసీసీ ప్రకటన చేయకున్నప్పటికీ... కరోనా వైరస్ నేపథ్యంలో ఇది ఖాయంగా కనబడుతుంది. 

టి20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని చాలాదేశాల క్రికెట్‌బోర్డులు ఐసీసీపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 కారణంగా అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు భారీ నష్టాల్లో కూరుకుపోయి, ఆటగాళ్లకు కనీసం జీతాలు చెల్లించలేకపోతున్న విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios