Asianet News TeluguAsianet News Telugu

మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేసిన మహిళా వికెట్ కీపర్...

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గా ఆసీస్ వికెట్ కీపర్ అలీస్సా హేలీ...

అంతర్జాతీయ టీ20ల్లో ధోనీ డామినేషన్‌ను బ్రేక్ చేసిన ఆసీస్ వికెట్ కీపర్...

 

Australia women wicket keeper Alissa Healy breaks MS Dhoni's  most dominating Record CRA
Author
India, First Published Sep 27, 2020, 7:32 PM IST

MS Dhoni: క్రికెట్ వరల్డ్‌లో ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ధోనీ పేరిట ఉన్న ఓ అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసింది ఓ మహిళా వికెట్ కీపర్. అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచుల్లో క్యాచ్‌లు, స్టంపింగ్ ద్వారా 91 వికెట్స్ తీశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనీ రికార్డును బ్రేక్... టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గా నిలిచింది ఆసీస్ వికెట్ కీపర్ అలీస్సా హేలీ. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో ఓ స్టంప్, ఓ క్యాచ్ అందుకున్న ఆలీస్సా హేలీ... టీ20ల్లో 92 వికెట్స్ తీసిన మొట్టమొదటి వికెట్ కీపర్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ కాకుండా 74 వికెట్స్‌తో సారా టేలర్, 72 వికెట్లతో రాచెల్ ప్రీస్ట్, 70 వికెట్లతో మెరస్సా ఉన్నారు. ఈ ముగ్గురూ మహిళా క్రికెటర్లే.

ms dhoni, alissa healy ఆలీస్సా హేలీ

పురుషుల క్రికెట్‌లో ధోనీ తర్వాత విండీస్ వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 63 వికెట్లతో, బంగ్లా వికెట్ కీపర్ ముస్ఫికర్ రహీమ్ 61 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇన్నాళ్లు క్రికెట్ వరల్డ్‌లో ధోనీ పేరిట ఉన్న అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన అలీస్సా హేలీ, త్వరలో 100 వికెట్ల మైలురాయి చేరుకోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios