ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ తో టెస్టు మ్యాచ్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత ఆసీస్ బ్యాటింగ్ చేయగా.. 416 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ భారీ స్కోర్ ని చేధించే దిశగా న్యూజిలాండ్ రంగంలోకి దిగింది. కాగా..  తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్... మ్యాచ్ ప్రారంభంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

రెండో రోజు ఆట ముగిసేసమయానికి  కేవలం 106 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అయితే... ఈ మ్యాచ్ లో ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ చాలా హైలెట్ గా నిలిచింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్ లో ఈ అద్భుతమైన క్యాచ్ నమోదైంది. ఆ ఓవర్ బౌల్ చేసిన మిచెల్ స్టార్క్ షార్ట్ పిచ్ బంతిని వేశాడు. అయితే థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడాలనుకున్న కివీస్ కెప్టెన్ బోల్తా కొట్టాడు. తను షాట్ ఆడగా బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్ వైపుగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగగ్ చేస్తున్న స్మిత్ చురుగ్గా స్పందించాడు. అమాంతం కుండివైపుకు డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని అందుకొని... అదిరిపోయే క్యాచ్ పట్టాడు.

 

రెప్పపాటులో స్మిత్ పట్టుకున్న క్యాచ్ చూసి విలియమ్స్ కూడా కంగుతిన్నాడు. ఇక చేసేది లేక నిరాశగా పెవిలియన్స్ కి చేరాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన  న్యూజిలాండ్ కి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ డకౌటయ్యాడు. జీత్ రావల్(1) కూడా త్వరగానే పెవిలియన్ కి చేరాడు.