ఆస్ట్రేలియా పర్యటనను భారత్ దిగ్విజయంగా పూర్తి చేసింది. చివరగా టెస్టు సిరీస్ లో విజయం సాధించి.. అందరినీ ఆనందంలో ముంచెత్తారు. కాగా.. ఆస్ట్రేలియా టూర్‌ను విజ‌యవంతంగా ముగించిన ఇండియ‌న్ టీమ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ మేర‌కు బీసీసీఐకి ఓ లేఖ రాసి ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. 

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించిన వేళ.. ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య కూడా బీసీసీఐలోని మా మిత్రుల వ‌ల్లే ఈ టూర్ విజ‌య‌వంత‌మైంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌శంసించింది. మీ త్యాగాల‌ను ఎప్పుడూ మ‌ర‌చిపోము అని కూడా అన‌డం విశేషం. మీ స్నేహం, న‌మ్మ‌కం, నిబ‌ద్ధ‌త‌కు ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ ఎప్పుడూ కృతజ్ఞ‌త‌తో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. 

ఈ సిరీస్ ప్ర‌పంచంలోని ఎన్నో కోట్ల మందిలో ఆనందం నింపింద‌ని ఆ లేఖ‌లో క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. టూర్‌లో భాగంగా వ‌న్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా గెల‌వ‌గా.. టీ20, టెస్ట్ సిరీస్‌ల‌ను టీమిండియా త‌న ఖాతాలో వేసుకుంది. ఈ టూర్‌లో ఇండియ‌న్ టీమ్ చూపించిన ధైర్యం, లాఘ‌వం, నైపుణ్యానికి క్రికెట్ ఆస్ట్రేలియాలోని ప్ర‌తి ఒక్క‌రి త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు లేఖ‌లో పేర్కొంది