కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్‌ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది. 

T20 Worldcup లో అన్ని దేశాల జట్లు అదరగొడుతున్నాయి. అయితే.. ఈ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. టీ 20 ఫార్మాట్ లో ప్రపంచకప్ చరిత్రలో వరసగా.. రెండుసార్లు వందలోపే ఆలౌట్ అయిన మూడో జట్టుగా నిలిచింది. దుబాయి వేదికగా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కేవలం 73 పరుగులకే కుప్పకూలి.. ఈచెత్త రికార్డును నమోదు చేసింది.

Also Read: టెస్టులకూ సారథిగా హిట్ మ్యాన్..? మద్దతుగా నిలుస్తున్న కొత్త కోచ్.. మరి విరాట్ రోల్ ఏంటి..!

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డుతో.. చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇక అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో కెన్యా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 73 పరుగులు, శ్రీలంకతో మ్యాచ్‌లో 88 పరుగులకే ఆలౌట్‌ అయింది. కెన్యా తర్వాతి స్థానంలో అఫ్గనిస్తాన్‌ ఉంది. 2012 పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 80 పరుగులు, 2014లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 72 పరుగులకే చాపచుట్టేసి అప్రదిష్టను మూటగట్టుకుంది. 

Also Read: ఒక్క క్రికెటర్‌కి ఇన్ని రికార్డులా... టెండూల్కర్, ఎమ్మెస్ ధోనీ వల్ల కానివి, చేసి చూపించిన విరాట్ కోహ్లీ...

ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌-2021లో భాగంగా తొలుత దక్షిణాఫ్రికాతో 84 పరుగులు, ఆసీస్‌తో మ్యాచ్‌లో 73 పరుగులకే ఆలౌట్‌ అయి బంగ్లాదేశ్‌.. ఈ రెండు దేశాల సరసన చేరింది. అంతేగాక... టీ20 మ్యాచ్‌లలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో మూడు సార్లు(దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతిలో రెండుసార్లు) వంద పరుగుల లోపు ఆలౌటైన తొలి జట్టుగా మహ్మదుల్లా బృందం నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read: అక్కడ హీరో, ఇక్కడ విలన్... టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అంటే వారికి ఎందుకు పడదు...

కాగా బంగ్లాదేశ్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆడం జంపా చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి బంగ్లా జట్టు పతనాన్ని శాసించి 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Also Read: డ్యాన్సర్ కోహ్లీ ఈజ్ బ్యాక్... ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ...