ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో వ్యాపకం ఉంటుంది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మాత్రం స్ఫూఫ్ వీడియోలు, రీఫేస్ వీడియోలు చేస్తూ అభిమానులకు వినోదం పంచడం అలవాటు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరి హీరోల ఫేమస్ వీడియోలు, డైలాగులను దించేసిన డేవిడ్ వార్నర్... తాజాగా మెగాస్టార్ ‘ఆచార్య’ టీజర్‌ను రీఫేస్ చేసి పోస్టు చేశాడు. 

రెండు రోజుల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. 24 గంటల్లో 8.5 మిలియన్ల వ్యూస్, 5 లక్షల లైకులు వచ్చాయి.. అయితే కొన్ని సీన్లలో మెగాస్టార్ ముఖం కృత్రిమంగా, అతికించినట్టు కనిపించిందనే విమర్శలు వచ్చాయి.

అయితే డేవిడ్ వార్నర్ పెట్టిన ఆచార్య పోస్టుకి మంచి స్పందన వస్తోంది. కొన్ని రోజుల వార్నర్ భాయ్... కేజీఎఫ్ 2 టీజర్‌లోని రాకీ భాయ్‌గా మారిన సంగతి తెలిసిందే. వీటితో పాటు సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, హృతిక్ రోషన్, మిస్టర్ బీన్, రజినీకాంత్‌ వీడియోలతో పాటు మోనాలిసా పెయింటింగ్‌ను కూడా రీఫేస్ చేసి పోస్టు చేశాడు వార్నర్.