ఏడాది కిందట బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ ఎపిసోడ్‌లో కీలక భూమిక పోషించిన స్టీవ్ స్మిత్, వార్నర్‌‌లు నిషేధం సైతం విధించింది.

ఈ ఘటన నుంచి ఆస్ట్రేలియా క్రికెట్‌ చాలా ఏళ్లు తేరుకోలేదు. ఈ క్రమంలో మరో క్రికెటర్ బాల్ టాంపరింగ్ చేయాలంటేనే భయపడే స్థితికి చేరారు. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన ప్రవర్తనతో టాంపరింగ్ సందేహాలు రేకెత్తించాడు.

తన తొలి స్పెల్‌ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం తర్వాత బంతిని రుద్దడం సందేహాలకు కారణమైంది.

మ్యాచ్ సమయంలో కెమెరాలన్నీ అతని వైపే ఫోకస్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంపా తీరు అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు కొందరు నెటిజన్లు.