వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్..!
ఆయన మళ్లీ మ్యాచ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఈ వార్త విని ఆసిస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ విషయంపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ అప్ డేట్ ఇచ్చాడు.
వరల్డ్ కప్ సమరం మొదలుకానుంది. వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్ కప్ లో విజయం సాధించేందుకు అన్ని టీమ్స్ ఎంతో కష్టపడుతున్నాయి. ఇప్పటి కే అన్ని దేశాలు టీమ్స్ ని కూడా ప్రకటించేశాయి. అయితే, ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ ఈవెంట్ కి దూరయ్యే పరిస్థితి ఏర్పడింది.
దక్షిణాఫ్రికాతో నాలుగో వర్డే మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతని చేతికి గాయం అయ్యింది. ట్రావిస్ హెడ్ హ్యాండ్ ఫ్యాక్చర్ అయ్యింది. దీంతో, మ్యాచ్ మధ్యలో హెడ్ రిటైర్డ్ హెడ్ గా వెనుదిరిగాడు. అయితే, ఆ గాయం త్వరగా తగ్గితే తప్ప, ఆయన మళ్లీ మ్యాచ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఈ వార్త విని ఆసిస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ విషయంపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ అప్ డేట్ ఇచ్చాడు.
హెడ్ ఫ్రాక్చర్ అయిన మాట నిజమేనని చెప్పారు. అయితే, దానిని నుంచి ఆయన కోలుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టదు అని చెప్పారు. స్కానింగ్ చేస్తే, తప్ప ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదన్నారు. వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమేనని ఆయన అన్నారు.
కాగా, ఆయన ఒక్కడే కాదు, ఇఫ్పటికే స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్ వెల్ వంటి స్టార్లు కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడతున్నారు. స్టీవ్ స్మిత్ చాలాకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రాక్టీస్ మ్యాచుల్లో పాల్గొంటున్నా కూడా, ఆ గాయం పూర్తిగా తగ్గి, ఫిట్నెస్ లో పాస్ కావడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.
ఇలా ఇంత మంది గాయాల బారినపడటం, ఆసిస్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఒక, వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.