గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా 227 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 74 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను సిరాజ్ అవుట్ చేశాడు.

సిరాజ్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్మిత్. ఆ తర్వాత 90 బంతుల్లో 3 ఫోర్లతో 37 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఇప్పటికే 260 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది ఆస్ట్రేలియా.

గబ్బా పిచ్‌పై ఇది రికార్డు స్కోరు. ఇక్కడ అత్యధిక చేధన 236 పరుగులు మాత్రమే. అది కూడా 1951లో విండీస్‌పై ఆసీస్ ఈ లక్ష్యాన్ని చేధించింది. ఈ 40 ఏళ్లలో ఇక్కడ 170 పరుగులే అత్యధిక లక్ష్యచేధన. ఇది కూడా ఇంగ్లాండ్‌పై ఆసీస్ విజయవంతంగా చేధించిందే.