Asianet News TeluguAsianet News Telugu

భయమేసింది! ఇప్పుడు బాగానే ఉన్నా... కోలుకుని, కామెంటరీ బాక్సుకి తిరిగొచ్చిన రికీ పాంటింగ్...

వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టుకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నరికీ పాంటింగ్... శుక్రవారం కామెంటరీ చెబుతూ అస్వస్థతకు గురైన మాజీ కెప్టెన్... 

Australia former Captain Ricky Ponting joins after discharge from Hospital
Author
First Published Dec 3, 2022, 1:33 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్, గురువారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. మూడో రోజు ఆట మొదలయ్యాక తొలి సెషన్‌లో 40 నిమిషాలు కామెంటరీ చెప్పిన రికీ పాంటింగ్, ఛాతీలో నొప్పి రావడంతో సిబ్బంది సాయంతో ఆసుపత్రికి వెళ్లాడు...

రికీ పాంటింగ్‌కి ఛాతి నొప్పి వచ్చిన సమయంలో పక్కనే అతని ఫ్రెండ్, మాజీ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఉన్నాడు. చికిత్స తర్వాత రికీ పాంటింగ్, తిరిగి కామెంటరీ బాక్సులో చేరాడు.

‘నిన్న నాకు ఛాతీలో నొప్పి రాగానే కాస్త భయమేసింది. నా కంటే ఎక్కువగా నా కుటుంబసభ్యుల గురించే ఎక్కువ భయపడ్డాను. కామెంటరీ బాక్సులో కూర్చున్న తర్వాత కొద్ది సేపటికే లైట్‌గా పెయిన్ రావడం మొదలైంది. అయితే లైవ్‌లో ఉండడం వల్ల దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ నొప్పి పెరుగుతూ పోతుండడంతో భయమేసింది. అయితే ఇప్పుడు చాలా బాగుంది. అద్దంలో చూసుకుంటే నా ముఖం వెలిగిపోతున్నట్టు అనిపించింది... గత 12,18 నెలల్లో నా ఆప్త మిత్రులను కోల్పోయాను. కాబట్టి ఏ చిన్నదాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిన్న జరిగిన అనుభవం తెలియచేసింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరగానే వార్త, ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్‌లో కలవరం సృష్టించింది. ఇదే ఏడాదిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్, షేన్ వార్న్ రూపంలో ఇద్దరు మాజీ క్రికెటర్లను కోల్పోయింది క్రికెట్ ఆస్ట్రేలియా. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆడిన ఈ ఇద్దరూ కొన్ని నెలల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు...

ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మరణించగా షేన్ వార్న్, ఓ రిసార్ట్‌లో అనుమానాస్పద రీతిలో శవమైతేలాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios