Asianet News TeluguAsianet News Telugu

ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... టీమిండియా టార్గెట్ 407... డ్రా అయినా చేసుకోగలరా?

రెండో ఇన్నింగ్స్‌లో 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా...

టీమిండియా ముందు 407 పరుగుల భారీ టార్గెట్...

క్యాచ్‌లు జారవిరిచి భారీ మూల్యం చెల్లించుకున్న టీమిండియా....

Australia declared after scoring massive total, 407 runs targets for team India Sydney CRA
Author
India, First Published Jan 10, 2021, 9:59 AM IST

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సిడ్నీ టెస్టులో గెలవాలంటే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత జట్టు లక్ష్యం 407 పరుగులు. కామెరూన్ గ్రీన్ 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 132 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 167 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు. లబుషేన్ 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ టిమ్ పైన్ 52 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో అశ్విన్, సైనీలకు రెండేసి వికెట్లు దక్కగా, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఫీల్డింగ్‌లో భారత ప్లేయర్లు ఈజీ క్యాచ్‌లను జారవిరిచారు. లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను హనుమ విహారి డ్రాప్ చేయగా... కామెరూన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ బుమ్రానే బౌలర్ కావడం విశేషం.

నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు చేసిన అత్యధిక పరుగుల చేధన 230 పరుగులు మాత్రమే. అది కూడా 2003లో. నేటి మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలన్నా భారత జట్టు 135 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios