కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

Also Read జడేజాలా బ్యాట్‌ను కత్తిలా తిప్పిన వార్నర్: జడ్డూలా చేశానా అంటూ ఫ్యాన్స్‌కు ప్రశ్నలు...

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న మొదట్లొ క్రీడాకారులంతా సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ఒకరిపై మరొకరు విసిరారు. 

కాగా..ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మర్నస్‌ లబుషేన్‌ లాక్‌డౌన్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇందు కోసం అతడికి పెంపుడు శునకం  సహాయం చేస్తోంది. లబుషేన్‌కు టెన్నిస్‌ బాల్‌తో అతడి స్నేహితుడు త్రోడౌన్లు చేస్తుంటే.. శునకం కీపర్‌గా బంతిని అందుకుంటోంది.