తాను ‘గే’నంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ నష్ట నివారణా చర్యలు చేపట్టాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదంటూ వివరణ ఇచ్చాడు
తాను ‘గే’నంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ నష్ట నివారణా చర్యలు చేపట్టాడు. తాను స్వలింగ సంపర్కుడిని కాదంటూ వివరణ ఇచ్చాడు.
‘‘నిన్న రాత్రి తాను చేసిన పోస్ట్ అపార్థాలకు దారి తీసింది.. తాను గేను కాదు. అయినప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటి నుంచి తనకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని తానెప్పటికీ మరచిపోలేనని స్పష్టం చేశాడు.
ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు, ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని అర్ధం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్ధతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఫాల్క్‌నర్ ట్వీట్ చేశాడు.
ఆదివారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా ఫాల్కనర్ ఆ విషయాన్ని తెలియజేశాడు. బాయ్‌ఫ్రెండ్ రాబర్ట్ జబ్‌తో ఐదేళ్లుగా కలిసుంటున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా.. బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే డిన్నర్ అంటూ రాబర్ట్‌తో కలిసుున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
దీంతో ఫాల్కనర్ ‘గే’ అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అంటూ ఆసీస్ మీడియా కోడై కూసింది. దీంతో ఫాల్క్‌నర్ స్పందించాడు. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ఈ వ్యవహారంపై స్పందించింది.
అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నామని.. పత్రికలు సైతం ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదని సీఏ అధికార ప్రతినిధి తెలిపారు. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఎ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
