యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు, తెలుగు ప్రజలు ఆయనకు వివిధ మార్గాల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేసి యంగ్‌టైగర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వార్నర్.. గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో వచ్చిన బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్ చేసిన వార్నర్.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్తగా విష్ చేయాలని నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగా జనతా గ్యారేజ్ సినిమాలోని పక్కా లోకల్ పాటకు డేవిడ్ వార్నర్, క్యాండిస్ వార్నర్‌లు టిక్‌టాక్ చేసి, తమదైన స్టెప్పులతో అదరగొట్టారు. తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఈ రోజు అద్భుతంగా ఉండాలి.. తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ, నీ డ్యాన్స్ అద్భుతమని వార్నర్ ట్వీట్ చేశాడు.

ఈ వీడియోను డేవిడ్  వార్నర్ సోషల్ మీడియాలో పెట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ దానిని రీట్వీట్ చేసింది. ‘‘యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ది బుల్ (వార్నర్) కాంబినేషన్ ఎలా ఉందంటారు అని కామెంట్ పోస్ట్ చేశారు.