The Ashes 2021-22: యాషెస్ సిరీస్ లో భాగంగా రేపట్నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరుగనున్నది. తొలి  టెస్టులో గాయపడ్డ ఆ జట్టు ఓపెనర్.. ఈ మ్యాచులో ఆడతాడా..? లేదా..? అని ఆంధోళన పడుతున్న ఆసీస్ అభిమానులకు  పాట్ కమిన్స్ శుభవార్త చెప్పాడు. 

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు మొదలుకానున్నది. పింక్ బాల్ టెస్టు (డే అండ్ నైట్) గా జరుగుతున్న ఈ మ్యాచులో గెలిచి సిరీస్ లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ భావిస్తున్నది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఆ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మొదటి టెస్టులో గాయపడ్డ ఆ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఈ మ్యాచులో ఆడతాడా..? లేదా..? అని ఆంధోళన పడుతున్న ఆసీస్ అభిమానులకు పాట్ కమిన్స్ శుభవార్త చెప్పాడు. 

అడిలైడ్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆడనున్నాడని కమిన్స్ తెలిపాడు. తొలి టెస్టులో గాయపడ్డ వార్నర్.. ఆ మ్యాచులో గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. దీంతో అతడు రెండో టెస్టుకు దూరమవుతాడని వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఆ జట్టు ఆసీస్ పేసర్ జోష్ హెజిల్వుడ్ సేవలను కోల్పోయింది. పక్కటెముకల పట్టేయడంతో హెజిల్వుడ్.. రెండో టెస్టులో ఆడటం లేదు. 

Scroll to load tweet…

హెజిల్వుడ్ స్థానంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాడు జై రిచర్డ్సన్ ఆడనున్నాడు. కాగా 2019 లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన రిచర్డ్సన్ కు ఇదే తొలి యాషెస్. అయితే హెజిల్వుడ్ కు ఈ గ్రౌండ్ లో మంచి రికార్డు ఉంది. అడిలైడ్ లో అతడు ఏడాది క్రితం భారత్ తో జరిగిన టెస్టులో ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక పింక్ బాల్ టెస్టులలో కూడా అతడు ఇప్పటివరకు 32 వికెట్లు తీసుకున్నాడు. మరి రిచర్డ్సన్.. హెజిల్వుడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా..? 

మరోవైపు డేవిడ్ వార్నర్ కు అడిలైడ్ హోం గ్రౌండ్. ఇక్కడ భారీగా పరుగులు సాధించాడు. టెస్టులలో ఇప్పటివరకు అతడు 7,405 పరుగులు చేయగా.. అందులో అడిలైడ్ చేసినవే 1,045. ఇక్కడ అతడి సగటు ఏకంగా 80 కు పైనే ఉంది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో వార్నర్.. 94 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు. 

ఇక తొలి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్.. రెండో టెస్టులో అయినా గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తున్నది. అడిలైడ్ లో ఆసీస్ ను నిలువరించకుంటే ఇక యాషెస్ మీద ఇంగ్లాండ్ ఆశలు వదులుకున్నట్టే. ఇప్పటికే ఆ జట్టు ఐదు మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో ఉంది. ఇక తొలి టెస్టుకు దూరమైన ఆ జట్టు పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లు అడిలైడ్ లో ఆడనున్నారు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. పింక్ బాల్ టెస్టులలో ఆసీస్ కు ఇంతవరకు ఓటమి ఎదురుకాలేదు. గతంలో ఆ జట్టు ఆడిన ఎనిమిది పింక్ బాల్ టెస్టుల్లో అన్నింటికి అన్ని గెలిచింది. ఇది ఇంగ్లాండ్ ను కచ్చితంగా కలవరపరిచేదే.