టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో డేటింగ్ లో ఉన్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇప్పటి వరకు ఈ ఇద్దరూ స్పందించలేదు. అయితే... రూమర్స్ మాత్రం నిజమని చెప్పకనే చెప్పారు. ఇద్దరూ కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేఎల్ రాహుల్‌, అతియా శెట్టి కొత్త ఏడాదిని ఘనంగా జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌ వెళ్లారు. థాయిలాండ్ బీచ్‌లో కేఎల్ రాహుల్ పరిగెత్తే ఫోటోతో పాటు అతియా శెట్టి బీచ్‌లో సేద తీరుతున్న ఫోటోలు తమ తమ ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ వ్యవహారం నడుస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అతియా శెట్టి .. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కుమార్తె. అతియా  2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన 'హీరో' సినిమాతో కథానాయికగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.