Asia cup 2023: టాస్ గెలిచిన టీమిండియా... తిలక్ వర్మకు ఛాన్స్! నామమాత్రపు మ్యాచ్‌లో గెలిస్తే..
India vs Bangladesh: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ... వన్డే ఆరంగ్రేటం చేస్తున్న తిలక్ వర్మ..
ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌కి అర్హత సాధించిన భారత జట్టు, నేడు బంగ్లాదేశ్‌తో నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన బంగ్లాదేశ్, ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటే, భారత జట్టు మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది..
గత మూడు మ్యాచులతో పోలిస్తే,నేడు కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువేనని వాతావరణ శాఖ తెలియచేసింది. అయితే ఇప్పటికే ఫైనలిస్టులు డిసైడ్ అయిపోవడంతో ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు..
వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా గెలిస్తే... వరల్డ్ కప్ ముందు టాప్ ర్యాంకుని చేజిక్కించుకోవచ్చు..
అలాగే వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో సెంచరీ చేస్తే... వచ్చే వారం టాప్ ప్లేస్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కి మరింత చేరువయ్యే అవకాశం దొరుకుతుంది.
ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్‌లో ఉన్న భారత జట్టు, మూడు ఫార్మాట్లలోనూ టాప్ ప్లేస్ దక్కించుకున్నట్టు అవుతుంది. నేటి మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ, వన్డే ఆరంగ్రేటం చేస్తున్నాడు..
వరుసగా మూడు రోజుల పాటు మ్యాచులు ఆడిన భారత జట్టు, నేటి మ్యాచ్‌లో ఐదుగురు కీ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చింది. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చింది. వీరి స్థానంలో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు.
బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ ముస్తాఫికర్ రహీం వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో నేటి మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడం లేదు. బంగ్లాదేశ్ తరుపున తంజీమ్ హసన్, నేటి మ్యాచ్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేస్తున్నాడు.
బంగ్లాదేశ్ జట్టు: తంజీద్ హాసన్, అమమోల్ హక్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తోహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తన్జీమ్ హసన్ షేక్, ముస్తాఫికర్ రెహ్మాన్
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ