Asia Cup 2023: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లో శ్రీలంక సూపర్ విక్టరీ... ఫైనల్‌లో ఇండియాతో ఢీ...

Asia Cup 2023: ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామా... 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న శ్రీలంక.. 

Asia Cup 2023: Sri Lanka beats Pakistan in last Over Thriller, Charith Asalanka CRA

ఆసియా కప్ 2023 ఫైనల్‌ క్వాలిఫైయర్ మ్యాచ్‌, సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీని తలపించింది. ఒకానొక దశలో శ్రీలంక ఈజీగా గెలిచేలా కనిపించినా కీలక సమయంలో వికెట్లు తీసిన పాకిస్తాన్... మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామా మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న శ్రీలంక జట్టు, ఆసియా కప్ 2023 ఫైనల్‌కి దూసుకెళ్లింది..


8 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన కుసాల్ పెరేరా రనౌట్ అయ్యాడు. 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది శ్రీలంక. 44 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఈ దశలో కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ కలిసి మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 51 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు ేసిన సధీర సమరవిక్రమ, ఆసియా కప్ 2023 టోర్నీలో మూడోసారి స్టంపౌట్ అయ్యాడు..

మరో ఎండ్‌లో 87 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 91 పరుగులు చేసిన కుసాల్ మెండిస్, ఆసియా కప్ 2023 టోర్నీలో రెండోసారి 90ల్లో అవుట్ అయ్యాడు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులు చేసి రనౌట్ అయిన కుసాల్ మెండిస్, నేటి మ్యాచ్‌లో మహ్మద్ హారీస్‌ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..

కుసాల్ మెండిస్ అవుట్ అయ్యే సమయానికి శ్రీలంక విజయానికి 41 బంతుల్లో 42 పరుగులు కావాలి. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన లంక కెప్టెన్ దస్సున్ శనక, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..


శ్రీలంక విజయానికి 9 బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్ బాదేందుకు ప్రయత్నించిన ధనంజయ డి సిల్వ, బౌండరీ లైన్ దగ్గర మహ్మద్ వసీం జూనియర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి దునిత్ వెల్లలాగే కూడా అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది.. వరుసగా 2 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. 

దీంతో శ్రీలంక విజయానికి 7 బంతుల్లో 9 పరుగులు కావాల్సి వచ్చాయి. ప్రమోద్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. లంక విజయానికి చివరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి వచ్చాయి. జమాన్ ఖాన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ప్రమోద్ సింగిల్ తీశాడు..

రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి బంతిని మిస్ చేసి, లేని రన్ కోసం ప్రయత్నించిన ప్రమోద్ రనౌట్ అయ్యాడు. చివరి 2 బంతుల్లో లంక విజయానికి 6 పరుగులు కావాల్సి వచ్చాయి..

ఐదో బంతికి ఫోర్ బాదిన చరిత్ అసలంక, లంకను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. చివరి బంతికి లంక విజయానికి 2 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి బంతకి 2 పరుగులు తీసిన చరిత్ అసలంక శ్రీలంకకి ఘన విజయాన్ని అందించాడు. 8 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌పై శ్రీలంకకి దక్కిన వన్డే విజయం ఇదే. 47 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసిన చరిత్ అసలంక, హాఫ్ సెంచరీ కోసం మూడో పరుగు తీసినా... అప్పటికే లంక గెలవడంతో దాన్ని లెక్కించలేదు.. 

అంతకుముందు వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్,  7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios